Plane Crashes In Congo : ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ మిలిటరీ అధికారులు సహా 14 మంది మృతి
Plane Crashes In Congo : ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సైనిక అధికారులతో కూడిన విమానం కుప్పకూలిపోయింది.
Congo Plane Crash
Plane Crashes In Congo : ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సైనిక అధికారులతో కూడిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులుసహా 14మంది ప్రాణాలు కోల్పోయినట్లు కాంగో సైన్యం వెల్లడించింది.
కాంగో సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఈ ప్రమాదంలో మృతి చెందారు. ముటోంబో కటలాయి టియెండే దేశ సైనిక న్యాయస్థానానికి అధిపతిగా వ్యవహరిస్తుండగా.. బకుమి లికులియా సాయుధ దళాల ఆడిటర్ జనరల్‌గా ఉన్నారు. వీరిద్దరితో పాటు డెలిగేషన్‌లో ఉన్న మరో 12 మంది విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంజ్ తెలిపారు.
ఈ విమానం నైరుతి కాంగోలోని కిక్విట్ నగరం నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. అనంతరం విమానం కేంజ్ ప్రాంతంలో కూలిపోయింది. విమానంలో ఉన్నవారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
విమాన ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టమైన సమాచారం తెలియలేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ.. ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు కాంగో సైన్యం తెలిపింది. కాంగో సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని వెల్లడించింది.
OVER DOZEN DEAD after PLANE CRASH in DR CONGO
AMONG 14 KILLED: Head of military court, and auditor general of armed forces
FIERY WRECKAGE and DEBRIS strewn ACROSS CRASH SITE pic.twitter.com/Hw36wJhoG0
— RT (@RT_com) September 25, 2026
