Hospital : కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

కరోనా ఆసుపత్రిలో ఘోరప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

Hospital

Hospital : కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి పది మంది మృతి చెందారు. ఈ ఘటన ఐరోపా దేశమైన ఉత్తర మెసిడోనియాలో చోటుచేసుకుంది. బాల్కన్‌ కౌంటీలోని టెటోవో నగరంలో ఉన్న ఓ కరోనా దవాఖానలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని పదిమంది కరోనా రోగులు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర మెసిడోనియాలో కరోనా తీవ్రత పెరిగింది.

దీంతో అక్కడ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.. ప్రమాదవశాత్తు ఆ ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి. దీంతో కొందరు ప్రాణాలతో బయటపడగా మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, అగ్నిప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియలేదన్నారు.

అయితే, ఓ పేలుడు తర్వాత మంటలు సంభవించినట్లు ఆ దేశ ప్రధాని జొరాన్ జాయెవ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. ఆగస్టు నుంచి ఉత్తర మెసిడోనియాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.