Fadher First Time Son
father’s emotion of holding the newborn baby in his arms : తొమ్మిది నెలలు మోసి కన్నబిడ్డ ఒడిలోకి వస్తే తల్లికి ఎంత సంతోషమో..అలాగే తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసుకునే సమయంలో తండ్రి భావోద్వేగం అంతకు మించి అనేలా ఉంటుంది. ఇదిగో దారిని ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియో. అప్పుడే పుట్టిన తన బిడ్డను చేతుల్లోకి తీసుకునే సయమంలో ఓతండ్రి ఎంత భావోద్వేగానికి గురయ్యో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో తండ్రి అప్పుడే తన భార్య ప్రసవించిన బిడ్డను బయటకు తీసుకొచ్చింది నర్సు. అలా ఆ పసిబిడ్డను తండ్రికి ఇవ్వటానికి తీసుకొచ్చింది. దాంతో ఆ తండ్రి ఆనందం అంతా ఇంతా కాదు.మొదటిసారి బిడ్డను చూస్తు తెగ మురిసిపోయాడు. ఆ పసిబిడ్డను అపురూపమైన కానుకను చూసినట్లుగా చూసుకున్నాడు.
తాను ఎత్తుకున్నాక బిడ్డకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సర్ధుకుని సర్ధుకుని కూర్చుంటూ బిడ్డను చేతుల్లోకి తీసుకుంటూ ఆ తండ్రి కట్టతడి పెట్టేశాడు. బిడ్డను చూసి నిలువెల్లా పులకరించిపోయాడు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మొదటిసారిగా తన కొడుకును చేతిలోకి తీసుకుంటూ కంటతడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా తమ బిడ్డను మొదటిసారి చేతుల్లోకి తీసున్న మధుర క్షణాలు గుర్తుకుతెస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.
First-time father holds his newborn baby for the first time. (?:Chrisxia29_)
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) September 19, 2021