Fish Falls From Sky: ఆకాశం నుంచి జారిపడి కారులోకి దూసుకెళ్లిన చేప

వర్జీనియాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆకాశం నుంచి చేప జారిపడింది. నేరుగా పార్క్ చేసిన కార్ మీద పడటంతో పెద్దగా శబ్దం వచ్చింది. ముందుగా అదెవరో కావాలని చేసిన పనిగా భావించినప్పటికీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో సీన్ రికార్డ్ అయింది.

Fish From Sky

Fish Falls From Sky: వర్జీనియాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఆకాశం నుంచి చేప జారిపడింది. నేరుగా పార్క్ చేసిన కార్ మీద పడటంతో పెద్దగా శబ్దం వచ్చింది. ముందుగా అదెవరో కావాలని చేసిన పనిగా భావించినప్పటికీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో సీన్ రికార్డ్ అయింది. ఈ సీన్ మొత్తాన్ని దగ్గర్లో నివాసముండే వారు వైరల్ హగ్ అనే యూట్యూబ్ ఛానెల్ కు వివరించారు.

ముందుగా నమ్మశక్యం కాని సంగతిని ఎవరూ నమ్మకపోయినా.. ఆ సీసీటీవీ ఫుటేజి చూసి ఆకాశం నుంచే పడిందని కన్ఫామ్ చేసుకున్నారు.

‘కార్ పార్క్ చేసి ఉంది. మరోవైపు చేపపడి కారుకు డ్యామేజ్ అయిందని అందరూ అన్నారు. స్థానికులంతా గన్‌షాట్ అయినట్లుగా శబ్ధం రావడంతో బయటకు వచ్చి చూశాం. అదేంటో చూద్దామని అక్కడకు వెళ్లి చూసేసరికి నిజంగా చేప కనిపించింది’

‘రికార్డు అయిన వీడియో చూసిన తర్వాత ఆకాశం నుంచి పడ్డ చేప కారుకు తగిలినట్లు కన్ఫామ్ అయింది. ఆ వీడియో లేకపోతే దీనిని ప్రూవ్ చేయడానికి అవకాశం ఉండేది కాదని స్థానికురాలు చెప్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో చేపలు ఎగురుతాయని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ఎవరో దూరం నుంచి బలంగా విసిరి ఉంటారంటూ కొట్టాపారేస్తున్నారు. ఇంకొందరైతే ఏదైనా పక్షి చేపను పట్టుకెళ్తూ జారవిడుచుకుని ఉండొచ్చు.. అని చెప్తున్నారు. వీడియో స్టార్ట్ అయిన సమయంలో ఆకాశంలో ఓ పక్షి ఎగురుతుండటం గమనించానని అంటున్నారు.