Apple Event 2025: రేపే యాపిల్ ఈవెంట్.. ఎయిర్‌పాడ్స్ ప్రో 3 నుండి కొత్త ఆపిల్ వాచ్ వరకు.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్.. ఇంకా..
Awe Dropping పేరుతో ఈవెంట్ లో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. అవి ఏంటి, వాటి ఫీచర్లు ఏంటి, ధర ఎంత ఉండొచ్చు తెలుసుకుందాం..

Apple Event 2025: మరో మెగా ఈవెంట్ కు యాపిల్ రెడీ అయ్యింది. Awe Dropping పేరిట యాపిల్ ఈ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.30 గంటలకు జరిగే కార్యక్రమంలో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్ లో కొత్త ఐఫోన్ 17 సిరీస్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ ఉండొచ్చు. ఐఫోన్‌లతో పాటు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎయిర్‌పాడ్స్ ప్రో 3, రిఫ్రెష్ చేసిన వాచ్ మోడళ్లను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.
Apple Watch Ultra 3 స్పెక్స్, ధర..
యాపిల్ వాచ్ అల్ట్రా 3.. మునుపటి వాటి కంటే చెప్పుకోదగ్గ అప్‌గ్రేడ్‌గా ఉంటుందని భావిస్తున్నారు, డిస్ ప్లే, కనెక్టివిటీ, హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్ లో ఇంప్రూవ్ మెంట్స్ ఉన్నాయి. ధర మునుపటి మోడళ్ల మాదిరిగానే సుమారు 799 డాలర్లు ఉంటుందని అంచనా. అల్ట్రా 3 అల్ట్రా 2 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది. కానీ పెద్ద 2.12-అంగుళాల డిస్ ప్లే, సన్నని కేసును కలిగి ఉండొచ్చు. అల్ట్రా 3 కొత్త S11 చిప్ ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. ఇది అల్ట్రా 2లోని S9 చిప్ కంటే గణనీయమైన పనితీరును అందిస్తుంది. అల్ట్రా 3 అధిక రక్తపోటు పర్యవేక్షణతో కూడిన మొదటి ఆపిల్ వాచ్ కావచ్చు. ఇది హైపర్ టెన్షన్ (రక్తపోటు)కు ముందస్తు హెచ్చరికలను అందిస్తుంది.
Apple Watch Series 11 స్పెక్స్, ధర..
సిరీస్ 11 ఆవిష్కరించబడనుంది. విడుదల తేదీ సెప్టెంబర్ 19 అని భావిస్తున్నారు. 42mm సైజు ధర సుమారు 399 డాలర్లు, 46mm సైజు ధర 429 డాలర్లు ఉంటుందని అంచనా. సిరీస్ 10 ఇప్పటికే రీ డిజైన్ చేశారు. దీంతో సిరీస్ 11 డిజైన్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. సిరీస్ 11 సెల్యులార్ మోడల్స్ 5G RedCap మద్దతుతో కొత్త MediaTek మోడెమ్‌ను కలిగి ఉండొచ్చు.
ఆపిల్ వాచ్ SE 3 స్పెక్స్, ధర..
రాబోయే యాపిల్ వాచ్ SE 3 మరింత ఆధునికంగా ఉంటుందని భావిస్తున్నారు. రెండు స్క్రీన్ సైజులు – 1.6 అంగుళాలు, 1.8 అంగుళాలు – స్లిమ్మర్ బెజెల్స్ తో రానున్నాయి. ఈ కొత్త మోడల్ వాచ్ ఓఎస్ 26 తో ప్రారంభించబడుతుంది. ఇది కొత్త స్మార్ట్ ఫీచర్లు UI ఇంప్రూవ్ మెంట్స్ తో రానుంది. యాపిల్ లైనప్‌లో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ ఉండాలనే లక్ష్యంతో SE 3 199 డాలర్ల నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. GPS మోడల్స్ ధర 249 డాలర్లుగా ఉండొచ్చని అంచనా.
యాపిల్ విజన్ ప్రో 2..
ఆపిల్ తన సెకండ్ జనరేషన్ మిక్స్డ్ -రియాలిటీ హెడ్‌సెట్, విజన్ ప్రో 2 ను 2025 చివరలో విడుదల చేయనుంది. ప్రాసెసర్ అప్‌గ్రేడ్ ఊహించినప్పటికీ, నివేదికలు విరుద్ధంగా ఉన్నాయి. M5 చిప్‌ను కలిగి ఉన్న మొదటి పరికరం విజన్ ప్రో 2 అని సూచిస్తున్నాయి. మరో నివేదిక ప్రకారం.. హెడ్‌సెట్ బదులుగా M4 చిప్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇది ఇప్పటికే ఐప్యాడ్ ప్రో మాక్ మోడళ్లలో అందుబాటులో ఉంది.
AirPods Pro 3 స్పెక్స్, ధర..
AirPods Pro 3 కొత్త, వేగవంతమైన H3 ఆడియో చిప్ ద్వారా శక్తిని పొందుతుందని తెలుస్తోంది. ఇది మరింత పనితీరు, మరింత మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ ట్రాన్స్‌లేట్ యాప్‌తో కలిసి పనిచేసే ఇయర్‌బడ్‌లతో రియల్-టైమ్ సంభాషణ అనువాదం ఒక అద్భుతమైన కొత్త సామర్థ్యం కావచ్చు. AirPods Pro 3 ధరలో పెరుగుదల ఉండొచ్చు. USలో ధర 249 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.
యాపిల్ టీవీ 4K స్పెక్స్, ధర..
ఫోర్త్ జనరేషనల్ ఆపిల్ టీవీ 4K ని 2025 చివరలో విడుదల చేయనుంది. సెప్టెంబర్, డిసెంబర్ మధ్య లాంచ్ అవుతుందని.. సెప్టెంబర్ 9 న జరిగే ఐఫోన్ 17 ఈవెంట్ లో ఆవిష్కరించబడుతుందని పుకార్లు వస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రోలో కనిపించే ప్రాసెసర్ A17 ప్రో చిప్ ను చేర్చడం ఒక ముఖ్యమైన అప్‌గ్రేడ్. ఆపిల్ నుంచి రెండు వెర్షన్లు రావొచ్చు. స్టాండర్డ్ Wi-Fi మోడల్, ఈథర్నెట్ పోర్ట్, థ్రెడ్ నెట్‌వర్కింగ్ సపోర్ట్‌తో కూడిన హై-ఎండ్ మోడల్.
HomePod Mini 2 స్పెక్స్, ధర..
ఇందులో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే ప్రస్తుత S5 ప్రాసెసర్ స్థానంలో కొత్త, మరింత శక్తివంతమైన చిప్ బహుశా S11 రావొచ్చు. హోమ్‌పాడ్ మినీ 2 యాపిల్ కొత్త ఇన్-హౌస్ వైర్‌లెస్ చిప్‌ను కలిగి ఉంటుందని రూమర్. ఇది Wi-Fi 6E లేదా Wi-Fi 7 కి మరింత స్థిరమైన కనెక్షన్లను, సపోర్ట్ ను అందిస్తుంది. హోమ్‌పాడ్ మినీ 2 ధర దాదాపు 99డాలర్లు ఉంటుందని అంచనా.
Also Read: శాంసంగ్ కంపెనీ అఫిషియల్ ప్రకటన.. ఆన్ లైన్లో శాంసంగ్ ఫోన్ కొనాలనుకుంటే తప్పకుండా ఇది చదవండి..