Thailand : నీటిలోంచి ఎగిరి వచ్చి జాలరి గొంతులో ఇరుక్కుపోయిన చేప..

Fish jumped out of water into man throat : చేపలు పట్టుకోవటానికి వెళ్లిన ఓ జాలరికి ఓ చేప చుక్కలు చూపించింది. ప్రాణంమీదకు తెచ్చింది. నీటిలోంచి ఎగిరి వచ్చిన ఓ చేప జాలరి గొంతులోకి వెళ్లి అక్కడనుంచి బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోయింది. దీంతో ఆ చేప పరిస్థితి ఏమోగానీ పాపం ఆ జాలరి పరిస్థితి మాత్రం విషమంగా మారింది. గొంతులోకి చిక్కుకుపోయిన చేప వల్ల ఊపిరి ఆడక నానా పాట్లు పడ్డాడు పాపం.

థాయ్‌లాండ్‌లో మే 22న పట్టాలంగ్‌ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో సదరు జాలరి పాపం స్థానికుల సహాయంతో ఎట్టకేలకు బతికి బయటపడ్డాడు.సముద్రంలో స్పియర్‌ ఫిషింగుకు ఓ జాలరికి ఈ అవస్థ వచ్చి పడింది. ‘అనాబస్‌’ అని పిలిచే అయిదంగుళాల స్పైకీ ఫిష్‌ నీటిలో నుంచి ఎగిరి నేరుగా జాలరి గొంతులోకి దూరిపోయింది. ఆ తర్వాత ఆ చేప కదిలి కదిలి జాలరి ముక్కులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి గొంతు, నాసికారంధ్రాల మధ్యలో ఇరుక్కుపోయింది. ఊపిరాడక విలవిల్లాడుతున్న అతణ్ని చుట్టుపక్కల ఉన్నవారు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రేలో చేపను గుర్తించిన వైద్యులు జాగ్రత్తగా వెలికితీసి, అతడి ప్రాణాలు కాపాడారు.

ట్రెండింగ్ వార్తలు