ఫోటోలంటే పిచ్చి ఉన్నవారు ఫోజుల్ని ఎలా కాదనగలరు. అందమైన ప్రదేశానికి వెళ్లినా..ఏదైనా టూర్ కు వెళ్లినా ఫోటోలు..వీడియోలు తీసుకోవటం సర్వసాధారణమే.
ఇండోనేషియా: ఫోటోలంటే పిచ్చి ఉన్నవారు ఫోజుల్ని ఎలా కాదనగలరు. అందమైన ప్రదేశానికి వెళ్లినా..ఏదైనా టూర్ కు వెళ్లినా ఫోటోలు..వీడియోలు తీసుకోవటం సర్వసాధారణమే. కానీ ఫోటోలు..సెల్ఫీల పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లి ప్రమాదాలను కూడా గుర్తించలేనంత పరిస్థితికి వెళ్లిపోతున్నారు కొంతమంది. ఈ క్రమంలో ఫోటోకు ఫోజులిచ్చే సమయంలో ఓ రాకాసి అల ఓ యువతిని పరిస్థితి చూస్తే గుండెలు అదిరిపోతాయి.
Read Also : న్యూజిలాండ్ లో తుపాకుల అమ్మకాలపై నిషేధం
అందంగా కనిపించే కెరటాలు.. మనుషులను అమాంతంగా మింగేస్తాయి. ఆదమరిచామా ఇది ఈ యువతిలాగే ప్రమాదంలో పడతారు. ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఉన్న డెవిల్స్ టియర్ నిత్యం పర్యాటకులతో కిటకిటాడుతుంటుంది. అక్కడి ప్రకృతి అందాలకు పర్యాటకులు పరవశించిపోతారు. ఆ అందాలను తమ కెమేరాలో బంధించాలని ఆత్రపడుతుంటారు.
ఈ సందర్భంగా ఓ యువతి సముద్రాన్ని ఆనుకుని ఉన్న రాతి కొండపై నిలుచుని ఫొటోకు పోజిచ్చింది. ఇంతలో ఓ పెద్ద కెరటం రాతి కొండను తాకింది. ఆ కెరటం వేగానికి ఆ యువతి ఎగిరిపడింది. అదృష్టంకొద్ది ఆమె సముద్రంలోకి జారుకోలేదు. స్వల్ప గాయాలతో బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also : కోహ్లీ.. అనుష్క రొమాంటిక్ స్టీల్ యాడ్