Pakistan : “మీ సమస్య భారత్ కాదు”.. ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌కు మాజీ సింగపూర్ రాయబారి స్ట్రాంగ్ కౌంటర్!

Pakistan : అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌పై మాజీ సింగపూర్ రాయబారి బిలహారి కౌసికన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Former Singapore Ambassador TROLLS Pakistan

Pakistan : అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌పై మాజీ సింగపూర్ రాయబారి బిలహారి కౌసికన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లలో పాకిస్థాన్ పరిస్థితి ఎలా ఉంటుందని ఒక ప్రపంచ సదస్సులో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పాకిస్థాన్ తీరుపై నిర్మొహమాటంగా కాస్త తీవ్రంగా స్పందించారు.

Also Read : Venezuela Earthquakes : శిథిలాల నుంచి 8రోజుల తర్వాత సజీవంగా బయటకు.. భార్య గురించి అతను చెప్పిన తొలి మాట ఇదే.. వీడియో వైరల్

భారత్, ఆఫ్ఘనిస్థాన్ లతో ఉన్న సరిహద్దుల వల్లే పాకిస్థాన్ సమస్యలు ఎదుర్కొంటోందన్న ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ అభిప్రాయాన్ని సింగపూర్‌ మాజీ రాయబారి బిలహరి కౌసికన్‌ తిప్పికొట్టారు. ప్రతిదానికి భౌగోళిక స్థానాన్ని కారణంగా చూపలేరు, ఇది కేవలం ఒక సాకు మాత్రమే అంటూ కౌంటర్ ఇచ్చారు. అమెరికా – ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం పాకిస్థాన్ దేశం ప్రతిష్టతను ప్రపంచ వ్యాప్తంగా పెరగవచ్చు. కానీ, ఆ దేశంలో అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించలేదన్నారు. ప్రారంభం నుంచి పాకిస్థాన్‌లో పాలన దారుణంగా ఉంది. నాకు ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదని అన్నారు.

పాకిస్థాన్ వైఫల్యం అంచున ఉన్న దేశం.. పాకిస్థాన్ సమస్యల భారత్, అఫ్ఘనిస్థాన్ కాదు.. ఆ దేశంలోని రాజకీయ నాయకులు, సైన్యమే అంటూ కౌసికన్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సవాళ్లపై చర్చిస్తున్నారు.

పాకిస్తాన్‌ స్వతంత్ర చరిత్రలో దాదాపు సగం కాలం పాటు సైన్యం పాలనలోనే ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యకలాపాలపై సైన్యం ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కౌసికన్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.