Moscow shopping mall : మాస్కో షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురి మృతి, 10 మందికి గాయాలు
మాస్కోలోని ఒక షాపింగ్ మాల్లో ఘోర ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 10 మంది గాయపడినట్లు మాస్కో అధికారులు తెలిపారు....
- saleem sk
- Updated on- July 23, 2023 / 08:24 AM IST
Moscow shopping mall
Moscow shopping mall : మాస్కోలోని ఒక షాపింగ్ మాల్లో ఘోర ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు వ్యక్తులు మరణించారు. (hot water pipe bursts) ఈ దుర్ఘటనలో 10 మంది గాయపడినట్లు మాస్కో అధికారులు తెలిపారు. వీడియో ఫుటేజ్ భవనం అంతటా నీరు, ద్వారం నుంచి ఆవిరి వెలువడ్డాయి.
Nellore government hospital : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది రోగుల మృతి?
మరుగుతున్న వేడి నీటి పైపు పగిలిపోవడంతో షాపింగ్ మాల్ (Moscow shopping mall) వద్దకు సహాయ పునరావాస పనులు చేపట్టేందుకు అత్యవసర సేవల వాహనాలు హుటాహుటిన వచ్చాయి. గాయపడిన వారిలో కొందరికి కాలిన గాయాలయ్యాయని, అత్యవసర సేవలు ఘటనాస్థలికి చేరుస్తున్నాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. 2007వ సంవత్సరంలో నిర్మించిన ఈ షాపింగ్ మాల్ లో 150కి పైగా దుకాణాలున్నాయి. క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నామని మేయర్ తెలిపారు.
