Nellore government hospital : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది రోగుల మృతి?

ల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 8మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరిన 8 మంది రోగులు ఆక్సిజన్ లేక పోవడం వల్లే మరణించారని మృతుల బంధువులు ఆరోపించారు....

Nellore government hospital : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది రోగుల మృతి?

Nellore government hospital

Nellore government hospital : నెల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 8మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరిన 8 మంది రోగులు ఆక్సిజన్ లేక పోవడం వల్లే మరణించారని మృతుల బంధువులు ఆరోపించారు. (kins claim lack of oxygen supply) ఈ ఘటన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేపింది. (Andhra government hospital)

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన..దళితుడికి మలం పూసి…

ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో రెండు గంటల సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక రోగులు మరణించారనే (Eight patients died) వార్త వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా వారంతా పలు వ్యాధుల వల్లే మరణించారని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. తమ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సిద్దానాయక్ చెప్పారు.

Delhi on high alert : యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్…ఢిల్లీలో హైఅలర్ట్

రోగుల బంధువుల ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగంలోకి దిగి విచారణ జరిపారు. మరణాలకు, ఆక్సిజన్ కొరతకు మధ్య ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ ఖండించారు. రోగుల మరణానికి ఇతర వైద్య కారణాలను నివేదికలో పేర్కొన్నారు. గతంలో కరోనా వ్యాధి ప్రబలిన సమయంలో ఆక్సిజన్ కొరతతో పలువురు రోగులు మరణించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ దర్యాప్తు చేసి రోగుల మరణాలకు కారణాలను నివేదికలో పేర్కొన్నారు.