Delhi on high alert : యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్…ఢిల్లీలో హైఅలర్ట్

యమునా నది నీటిమట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్ కు చేరుకుంది....

Delhi on high alert : యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్…ఢిల్లీలో హైఅలర్ట్

Yamuna floods

Delhi on high alert : యమునా నది నీటిమట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. (Delhi on high alert) ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ డేంజర్ లెవెల్ కు చేరుకుంది. (Yamuna water level likely to breach danger mark again)

Pension Hike : భారీగా పెన్షన్ పెంపు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, జీవో జారీ

యమునా నది తీరప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. లోతట్టుప్రాంతాలను యమునా నది వరదనీరు ముంచెత్తే ప్రమాదం ఉండటంతో ఢిల్లీ సర్కారు సహాయ పునరావాస పనులను చేపట్టింది. యమునా నది నీటిమట్టం పెరగడంతో తాము అప్రమత్తం అయ్యామని ఢిల్లీ రెవెన్యూశాఖ మంత్రి అతిషి చెప్పారు.

Bhadrachalam: పెరుగుతున్న గోదావరి వరద

సెంట్రల్ జిల్లా, తూర్పు జిల్లా లేదా యమునా బజార్ మరియు యమునా ఖాదర్ వంటి ప్రాంతాల్లో అధికారులు వరద సహాయ పునరావాస పనులు చేపట్టారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అధికారులతో సహకరించాలని మంత్రి అతిషి కోరారు. ఢిల్లీకి ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయని ఢిల్లీ నీటిపారుదల వరద నియంత్రణ విభాగం అధికారులు హెచ్చరించారు.

IND vs WI 2nd test : మెకంజీ ఔట్‌.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం .. Day 3 Updates

వరదల వల్ల రాజధానిలోని లోతట్టు ప్రాంతాల్లోని బాధిత కుటుంబాల పునరావాసంపై ప్రభావం చూపుతుందని, వారు ఎక్కువ కాలం సహాయక శిబిరాల్లో ఉండాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు దాదాపు వారం రోజులుగా నీటి ఎద్దడి, వరదలతో అల్లాడిపోతున్నాయి.