Pension Hike : భారీగా పెన్షన్ పెంపు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, జీవో జారీ

పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు జీవో జారీ చేసింది సర్కార్. Pension Hike

Pension Hike : భారీగా పెన్షన్ పెంపు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, జీవో జారీ

Pension Hike(Photo : Google)

Pension Hike – Physically Challenged : తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు జీవో జారీ చేసింది సర్కార్. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3,016 పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.4,016కు పెంచారు. అంటే, వెయ్యి రూపాయల మేర పెంపు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 20వేల మంది దివ్యాంగులకు లబ్ది చేకూరనుంది.

ఇకపై దివ్యాంగులు నెలకు 4,016 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. జులై నెల నుండి ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read..Hyderabad Realty: వృద్ధి బాటలో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్.. ఐదు రెట్లు పెరిగిన సేల్స్‌

ఇప్పటివరకు ప్రభుత్వం దివ్యాంగులకు ప్రతి నెల 3,016 రూపాయలు ఆసరా పెన్షన్ గా ఇస్తుండగా.. మరో వెయ్యి రూపాయలు పెంచుతూ ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తూ జీవో జారీ చేశారు.