Pakistan : నలుగురు మహిళల్ని వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు
పాకిస్తాన్‍లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నలుగురు మహిళలను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. వీరిలో ఓ యువతి కూడా ఉన్నారు.
- kunduru Vinod
- Published On : December 8, 2021 / 01:05 PM IST
Pakistan
Pakistan : పాకిస్తాన్‍లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నలుగురు మహిళలను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. వీరిలో ఓ యువతి కూడా ఉన్నారు. ఈ ఘటన పంజాబ్ ప్రావిన్సులోని ఫైసలాబాద్‌లో జరిగింది. నలుగురు మహిళలు ఓ స్టీల్ షాప్‌లోకి వచ్చారు. షాప్‌లో ఎవరు లేకపోవడంతో వస్తువులు తీసుకోని పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిని పట్టుకున్న షాప్ యజమాని మరికొందరి సాయంతో వారిపై దాడి చేశాడు. రోడ్డుపై పరుగులు పెట్టిస్తూ కొట్టారు. తమని వదిలేయండని కాళ్ళమీద పడినా కనికరించకుండా దాడి చేశారు.
చదవండి : Pakistan Man Crossed Border : భారత్ లో ప్రేయసి కోసం..బోర్డర్ దాటిన పాక్ యువకుడు అరెస్ట్
సుమారు గంట పాటు మార్కెట్ వీధిలో నగ్నంగా ఊరేగించారు. శరీరంపై కప్పుకోవడానికి బట్టలు ఇవ్వండి అంటూ ఆ మహిళలు వేడుకున్నా.. ఏమాత్రం కనికరం చూపలేదు. వీరి దాడిలో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. 17ఏళ్ల యువతిని కూడా దారుణంగా కొట్టారు. ఇక ఈ దృశ్యాలు స్థానికులు తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు చేపట్టారు.
చదవండి : Pakistani Couple : బోర్డర్‌లో పాక్ మహిళ డెలివరీ.. బిడ్డకు సరిహద్దు పేరు
