Pakistani Couple : బోర్డర్‌లో పాక్ మహిళ డెలివరీ.. బిడ్డకు సరిహద్దు పేరు

నింబుబాబు గర్భవతి. డిసెంబర్ 02వ తేదీన నింబుబాయి ప్రసవించింది. కొంతమంది మహిళలు సుఖప్రసవం అయ్యేందుకు సహకరించారు.

Pakistani Couple : బోర్డర్‌లో పాక్ మహిళ డెలివరీ.. బిడ్డకు సరిహద్దు పేరు

Pak Women

Updated On : December 5, 2021 / 9:11 PM IST

Attari Border : సరిహద్దులో పాక్ దేశానికి చెందిన ఓ మహిళ ప్రసవించింది. దీంతో పుట్టిన బిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టుకున్నారు దంపతులు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ దేశానికి చెందిన కొంతమంది పౌరులు అటారీ సరిహద్దులో చిక్కుకపోయారు. గత 71 రోజులుగా అక్కడే ఉండిపోయారు. దాదాపు 97 మందిలో పంజాబ్ ప్రావిన్స్ నగరం..రాజన్ పూర్ జిల్లాకు చెందిన నింబుబాయి, బాలంరామ్ దంపతులు కూడా చిక్కుకున్న వారిలో ఉన్నారు. అప్పటికే నింబుబాబు గర్భవతి. డిసెంబర్ 02వ తేదీన నింబుబాయి ప్రసవించింది.

Read More : Tiruchanoor : శ్రీవారి పాదాలు ధరించిన అమ్మవారు, సర్వభూపాల వాహనసేవ

పొరుగున్న ఉన్న కొంతమంది మహిళలు సుఖప్రసవం అయ్యేందుకు సహకరించారు. ఆమెకు వైద్య సదుపాయాలను కూడా సమకూర్చారు. లాక్ డౌన్ కు ముందు…తమ బంధువులను కలవడమే కాకుండా..తీర్థయాత్రల కోసం భారతదేశానికి వచ్చినట్లు, వచ్చిన 98 మంది వద్ద అవసరమైన పత్రాలు లేకపోవడంతో ఇంటికి తిరిగి రాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండో – పాక్ సరిహద్దులో పుట్టినందున మగబిడ్డకు బోర్డర్ పేరు పెట్టడం జరిగిందని బాలంరామ్ వెల్లడించారు. చిక్కుకున్నవారిలో 47 మంది పిల్లలున్నారు.

Read More : Tomato Prices : చెన్నైలో కిలో టమాటా ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!

వీరంతా…ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న వారు. ఆరుగురు భారతదేశంలో జన్మించారు. మరో పాక్ మహిళ…2020 జోధ్ పూర్ గ్రామంలో ప్రసవించడంతో…కొడుక్కి భరత్ అని పేరు పెట్టుకున్నారు. జోధ్ పూర్ లో ఉంటున్న సోదరుడి నివాసానికి వచ్చి…పాక్ కు చేరలేకపోయింది. చిక్కుకున్న వారిని దేశంలోకి ప్రవేశించడానికి పాక్ రేంజర్లు అనుమతించడం లేదు. దీంతో అటారీ సరిహద్దులో టెంట్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరికి స్థానికంగా ఉన్నవారు హెల్ప్ చేస్తున్నారు. తినడానికి మూడు పూటల భోజనం, దుస్తులు అందిస్తున్నారు.