Untitled(10)
Journalist Kidnap: సెన్సేషనల్ న్యూస్ కోసం జర్నలిస్టులు ఎంతకైనా తెగిస్తారు. ప్రాణాలను పణంగాపెట్టి సమాజ బాగు కోసం సమాచారాన్నిసేకరిస్తుంటారు. అలా ఉగ్రవాదుల వద్ద సమాచార సేకరణకు వెళ్లిన ఓ ఫ్రెంచ్ జర్నలిస్ట్, ఊహించని పరిణామంలో చిక్కుకున్నాడు. జిహాదీల ఇంటర్వ్యూ తీసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టు, చివరకు జిహాదీల చెరలో బందీ అయ్యాడు. జిహాదీల జీవన చిత్రాన్ని తీసేందుకు కెమెరా పట్టుకు వెళ్లిన జర్నలిస్టు.. చివరకు ఆ కెమేరాతోనే తన కిడ్నప్ కథను రికార్డు చేయాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు. గత తొమ్మిది నెలలుగా జిహాదీల వద్ద బందీగా ఉన్న ఆ జర్నలిస్టును విడిపించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
Also read: Lorry in Danger: మ్యాప్స్ ను నమ్ముకుని వెళ్లి కొండ అంచుల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్
ఫ్రాన్స్ కు చెందిన ఒలివర్ డుబోయిస్ అనే జర్నలిస్టు.. 2015 నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో నివసిస్తున్నాడు. ఫ్రాన్స్ కు చెందిన “లిబరేషన్” అనే పత్రికకు వార్తలు చేరవేస్తుంటాడు. డుబోయిస్ కు మాలి దేశ భౌగోళిక అంశాలపై బాగా పట్టుంది. ఇక్కడే అనేక మంది మిత్రులను సంపాదించుకున్న డుబోయిస్..ఆదేశంలో జిహాదీలు సృష్టిస్తున్న అరాచకాలపై వ్యాసాలు రాయసాగాడు. ఈక్రమంలో “జమా నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్” (JNIM) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న అబ్దల్లా అగ్ అల్బకాయేను.. డుబోయిస్ వ్యక్తిగతంగా కలిసి ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాడు. ఆమేరకు తెలిసిన వారి ద్వారా అబ్దల్లా అగ్ ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూ చేసేందుకు “లిబరేషన్” పత్రిక ఒలివర్ డుబోయిస్ కు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ డుబోయిస్ తనంతట తానే ఈ ఇంటర్వ్యూ చేయదలచుకున్నాడు.
Also read: Lovebirds Threat: జ్యోతుల నెహ్రూ అనుచరుల నుండి ప్రాణహాని ఉంది: ప్రేమ జంట
అనుకున్నట్టుగానే 2021 ఏప్రిల్ 8న మాలిలోని బామాకో నుంచి గావోకు చేరుకున్నాడు. JNIM నాయకుడు అబ్దల్లా అగ్ అల్బకాయేను ఇంటర్వ్యూ చేసి తిరిగి మరుసటి రోజే తిరిగి రావాల్సిన డుబోయిస్ తిరిగి రాలేదు. దీంతో అతని సన్నిహితులు మాలిలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. కాగా మే 5న వెస్ట్ ఆఫ్రికాలోని మరో ఉగ్రవాద సంస్థ “వరీత్ అల్-కస్సామ్”కు చెందిన మీడియా ఛానల్ లో.. ఒలివర్ డుబోయిస్ కు చెందిన వీడియో దర్శనమిచ్చింది. ఆ వీడియో ప్రకారం “ఇంటర్వ్యూ కోసం వచ్చిన తనను.. జిహాదీలు బందీగా ఉంచారని, ప్రభుత్వం స్పందించి రక్షించాలని” ఒలివర్ డుబోయిస్ వేడుకున్నాడు. అది చూసిన ఫ్రెంచ్, మాలి రాయబార కార్యాలయాల అధికారులు డుబోయిస్ విడుదల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై సమగ్ర వివరాలు సేకరిస్తున్న ఒలివర్ డుబోయిస్ కు.. JNIM ఉగ్రవాదులతో తరచూ సమావేశాలు ఉండేవి. మాలి దేశంలో ఉన్న ఉగ్రసంస్థల్లో.. డుబోయిస్ కు మంచి గుర్తింపు ఉండడం విశేషం.
Also read: Crime News: దండుపాళ్యన్ని మించిన కర్నూలు గ్యాంగ్, వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్
ఇక గత తొమ్మిది నెలలుగా జిహాదీల చెరలో ఉన్న డుబోయిస్..ఇలాంటి ఎన్నో ప్రమాదకర సమావేశాలకు వెళ్ళేవాడని అతని సన్నిహితులు తెలిపారు. సమావేశాలకు వెళ్లి.. ఒక వేళ తాను తిరిగిరాని పక్షంలో ఎవరికి సమాచారం అందించాలి, ఎవరిని కలవాలి అనే విషయాలను పేపర్ రాసి పెట్టుకునే డుబోయిస్.. ఆ పేపర్ ను అతని సన్నిహితురాలు “డెబోరా అల్ హవి అల్ మార్సి”కి అందించేవాడు. వెళ్లిన ప్రతిసారి తిరిగి వచ్చిన డుబోయిస్.. ఇప్పుడు తిరిగి రాకపోవడంతో డెబోరా ఆ పేపర్ ను ఫ్రెంచ్ అధికారులకు అందించింది. ఒలివర్ డుబోయిస్ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడని, అతని విడుదలకు తాము తీవ్రంగా కృషిచేస్తున్నట్లు ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు.
Also read: Indian Coast Guard : పది మందితో భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ పడవ.. పట్టుకున్న అధికారులు