Garuda Vishnu Kencana
Garuda Wisnu Kencana: హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఐశ్వర్యం, వైభవానికి ప్రతీక అని భక్తులు నమ్ముతారు. త్రిమూర్తులు శంకరుడు, బ్రహ్మ, విష్ణువు. వీరిలో విష్ణువుని హిందువులు భూమికి రక్షకుడిగా భావిస్తారు.
భారతదేశంలో విష్ణువును విభిన్న నామాలతో పూజిస్తారు. ఆయన గుడులులేని ప్రదేశం లేదు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణు విగ్రహం భారత్‌లో లేదు. ముస్లిం జనాభాలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న దేశంలో ఉంది.
గరుడ విష్ణు కేనానా ప్రపంచంలోనే ఎత్తైన విష్ణు విగ్రహం. ఇది ఇండోనేషియాలోని బాలిలో ఉంది. దీని నిర్మాణానికి 28 సంవత్సరాలు పట్టింది. 46 మీటర్ల బేస్ పీడెస్టల్‌తో కలిపి ఈ స్మారక చిహ్నం మొత్తం ఎత్తు 121 మీటర్లు (397 అడుగులు).
Also Read: పార్లమెంట్లో రచ్చ.. కేంద్రం తెచ్చిన 3 బిల్లులు ఏంటి? అమిత్ షా మీద పేపర్లు విసిరేంతగా అందులో ఏముంది?
2018 సెప్టెంబర్ 22న ప్రారంభం
న్యోమన్ నుర్తా డిజైన్ చేసిన ఈ విగ్రహాన్ని ఇండొనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 2018 సెప్టెంబర్ 22న ప్రారంభించారు. (Garuda Wisnu Kencana).
న్యోమన్ నుర్తా ఇండియాలో సత్కారం పొందారు. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించారు.
ప్రధానంగా కాపర్, బ్రాస్‌తో చేసిన ఈ విగ్రహ నిర్మాణం 1997లో ప్రారంభమైంది. అయితే 1997 ఆసియా ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 16 సంవత్సరాల విరామం తర్వాత 2013లో మళ్లీ నిర్మాణం ప్రారంభమైంది.
బాలి గరుడ విష్ణు కేనానా కల్చరల్ పార్క్‌లో ఉన్న ప్రదేశంలో సందర్శకులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, పండుగల్లో కూడా పాల్గొనవచ్చు. ఈ విగ్రహం.. నగురా రాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సులభంగా చేరవచ్చు.