×
Ad

Biggest Tunnel Gaza : భూమిలో కొత్త నగరం.. గాజాలో బయటపడ్డ భారీ సొరంగం.. బాప్‌రే.. ఇందులో ఎలాంటి సౌకర్యాలున్నాయంటే? వీడియో వైరల్

Biggest Tunnel Gaza : గాజాలో బయటపడిన భారీ సొరంగం ఫిలడెల్ఫీ కారిడార్ సమీపంలోని జనసాంద్రత గల నివాస ప్రాంతాల కిందుగా.. 25మీటర్ల లోతుతో ..

Biggest Tunnel Gaza

Biggest Tunnel Gaza : గాజాలో ఇజ్రాయెల్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. హమాస్‌ను అంతం చేసే లక్ష్యంతో కాల్పుల విరమణను ఉల్లంఘించి గాజా, లెబనాన్‌లో దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం (IDF) హమాస్‌కు చెందిన భారీ సొరంగాన్ని గుర్తించింది. ఇది ఏడు కిలో మీటర్లు కంటే ఎక్కువ పొడవుతోపాటు.. సుమారు 25 మీటర్ల లోతుతో ఉంది. ఈ సొరంగంలో హమాస్ కీలక నేతలు తలదాచుకోవడంతోపాటు ఇజ్రాయెల్ అమర సైనికుడు హదర్ గోల్డిన్ ను ఇక్కడే బంధీగా ఉంచినినట్లు ఇజ్రాయెల్ సైన్యం నిర్ధారించింది.

గాజాలో బయటపడిన భారీ సొరంగం ఫిలడెల్ఫీ కారిడార్ సమీపంలోని జనసాంద్రత గల నివాస ప్రాంతాల కిందుగా.. 25మీటర్ల లోతుతో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కంపౌండ్, మసీదులు, క్లినిక్స్‌, స్కూళ్లు లాంటి సున్నితమైన ప్రాంతాల గుండా వెళ్తుంది. ఈ సొరంగంలో ఏకంగా ఓ నగరాన్నే నిర్మించుకున్నారని, లోపల అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నట్లు ఇజ్రాయెల్ బలగాలు వెల్లడించాయి.

లోపల అందంగా గోడలను నిర్మించారు. వాటి నిర్మాణానికి టైల్స్ వాడారు. దాక్కోవడానికి వీలుగా సుమారు 80గదులు, వెస్ట్రన్ టాయిలెట్లతో కూడిన బాత్రూమ్ లు, కమాండ్ కంట్రోల్ రూమ్ లు, దీర్ఘకాలిక నివాసాలతో పాటు భారీగా ఆయుధ నిల్వలు గుర్తించారు. ఈ భారీ టెన్నెల్ కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.


భారీ టన్నెల్ లోపల నుంచి ఇజ్రాయెల్ దళాలు పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, హమాస్ పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. యూఎన్ఆర్‌డబ్ల్యూఏ కాంపౌండ్ కింద నుండి వెళ్లే ఈ సొరంగం అంతర్జాతీయ సమాజంలో తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ‘‘హమాస్ ఉద్దేశపూర్వకంగానే ప్రజలు నివసించే, మానవతా మౌలిక సదుపాయాలను మానవ కవచాలుగా ఉపయోగిస్తోంది. ఈ సొరంగమే అందుకు అత్యంత బలమైన రుజువు’’ అని ఐడీఎఫ్ ప్రతినిధి ఒకరు అన్నారు.