ఆ ఒక్క ఆస్టరాయిడ్ నిండా బంగారం, ప్లాటినం, వజ్రాలే

కొన్ని సంవత్సరాలుగా అంతరిక్షంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఏ పరిశోధనా సంస్థ నిర్వహించిన ప్రయోగానికైనా టార్గెట్ ఒకటే. అక్కడ విలువైన లోహాలు దొరికితే ప్రయోజనం పొందేయొచ్చని. సరిగ్గా అలాంటివే ఆస్టరాయిడ్స్ లో ఉన్నాయని బంగారం, ప్లాటినం, వజ్రాల్లాంటి విలువైన లోహాలను గుర్తించారు. ఆ ఆస్టరాయిడ్ ను సమీపిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ధనవంతులైపోవచ్చట.



Psyche అనే NASA లేటెస్ట్ మిషన్లో ’16Psyche’ అనే ఆస్టరాయిడ్ పై స్టడీ చేయనుంది. 226 కిలోమీటర్ల విస్తరించి ఉన్న ఈ ఆస్టరాయిడ్ సోలార్ సిస్టమ్ లో బుధ గ్రహానికి, బృహస్పతికి మధ్యలో ఉందట. ఇటీవల దాని క్రిటికల్ డిజైన్ పై ఓ అవగాహనకు కూడా వచ్చేశారు. అసలు సైంటిస్టులకు ఈ ఆస్టరాయిడ్ మాత్రమే టార్గెట్ అవడానికి కారణమేంటో తెలుసా.. అందులో ఉన్న నిధి నిక్షేపాలు ప్రపంచ ఎకానమీకి సమానమవుతాయట.



దాని మొత్తం నికెల్, ఇనుము, బంగారం వంటి లోహాలతో నిండి ఉంది. దీని విలువ దాదాపు 10వేల క్వాడ్రిలియన్ డాలర్లతో సమానం. భూమి మీ ప్రతి మనిషిని మిలియనీర్ చేయడానికి అది సరిపోతుంది. అంతేకాకుండా భూమి ఏర్పడటానికి గల కారణాలు సర్వే చేయడానికి NASA కొత్త డివైజ్ ను రెడీ చేసిందట.



ఈ ఆస్టరాయిడ్ ను స్టడీ చేయడంతో పాటు ఇతర గ్రహాలతో పాటు భూమి ఎలా ఏర్పడిందనే దాని గురించి తెలుసుకోనున్నామని నాసా చెప్తుంది. ఇదే ఉద్దేశ్యంతో స్పేస్ ఏజెన్సీ Psyche స్పేస్ క్రాఫ్ట్ ను రెడీ చేసింది. అదే ఆస్టరాయిడ్ పై ఉన్న అయస్కాంత క్షేత్రంపై స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది.