Man Arrested For Kicking Cat  : పిల్లిని తన్నినందుకు 10ఏళ్ల జైలుశిక్ష

పిల్లిని తన్నినందుకు 10ఏళ్ల జైలుశిక్ష.

Greek Man Arrested For Kicking Cat  : ఈ భూమ్మీద నివసించే మనుషులకే కాదు సకల జీవరాశులకు జీవించే హక్కు ఉంది. మూగ జీవాలకు కూడా హక్కులుంటాయి. వాటిని హింసిస్తే శిక్షలు ఉంటాయి. అలా ఓ మూగజీవాన్ని హింసించినందుకు ఓ ప్రబుధ్దుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. పెంపుడు జంతువుతో వెర్రి వేషాలు వేసిన వ్యక్తికి..10 ఏళ్లు జైలుశిక్ష విధించనుంది. సోషల్ మీడియా అందరు సరదా తీర్చేస్తది అన్నట్లుగా పెంపుడు జంతువు పట్ల వెర్రి వేషాలు వేసిన ఓ యువకుడికి న్యాయస్థానం కఠినకారాగార శిక్షవిధించనుంది.

యూట్యూబ్‌లో ఈ మధ్య ఒక వీడియో వైరల్‌ అయ్యింది. సముద్రం ఒడ్డున రెండు పిల్లులను ఆహారం ఎరవేసి కొద్దిసేపు ఆడించాడు ఓ వ్యక్తి. అలా ఆడిస్తూ..ఆడిస్తూ ఆకలిగా ఉన్న పిల్లి పట్ల శాడిస్టులా వ్యవహరించాడో వ్యక్తి. చేసింది ఓ దయలేని పని..దాన్ని వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అతని సరదా కాస్తా కాస్త మొరటుగా చెప్పాలంటూ దూల కాస్తా తీర్చేయనుంది కోర్టు. ఆ వీడియోలో పిల్లికి ఆహారం వే ఓ పిల్లిని సముద్రంలోకి లాగి పెట్టి తన్నాడు. రెండో పిల్లితో అలాగే చేయబోయాడు. కానీ కుదర్లేదు.

గ్రీస్‌లోని ఎవియా ఐల్యాండ్‌ దగ్గర జరిగింది ఈ వ్యవహారం. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అయ్యింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. దీంతో అతగాడు అది నా పెంపుడు పిల్లే అని..అక్కడ నీళ్లు లేవని, ఆ పిల్లి చచ్చిపోలేదు..సురక్షితంగానే ఉంది కదా అంటూ వాదించాడు. అయినా న్యాయస్థానం వదల్లేదు. అతని నేరం వీడియో ద్వారా రుజువైంది. దీంతో అక్కడి చట్టాల ప్రకారం.. అతనికి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

పౌర హక్కుల పరిరక్షణ మంత్రి టకిస్‌ థియోడోరికాకోస్‌ నిందితుడి అరెస్ట్‌ను ధృవీకరించారు. మూగ జీవాల పట్ల ఇలాంటి హింసను సహించే ప్రసక్తే లేదని అంటున్నారు. గ్రీస్‌ చట్టాల ప్రకారం..మూగ జీవాలను హింసించినా, దాడులకు పాల్పడినా 10ఏళ్లు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించబడుతుంది.

ట్రెండింగ్ వార్తలు