అరుదైన ఘనత…టైమ్స్ పర్శన్ ఆఫ్ ది ఇయర్ గా 16ఏళ్ల చిన్నారి

వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందిన స్పీడన్ కు చెందిన గ్రేటా థన్ బర్గ్ అనే 16 ఏళ్ల చిన్నారిని ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ 2019 పర్శన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఈ విధంగా పర్శన్ ఆప్ ది ఇయర్ ని ప్రకటించే సంప్రదాయం మొదలుపెట్టిన 1927నుంచి ఇప్పటివరకు ఈ చిన్నారే అత్యంత చిన్న వయస్సు ఉన్న వ్యక్తి.

గ్రేటా థన్ బర్గ్…ది పవర్ ఆఫ్ యూత్  అనే హెడ్ లైన్ తో కవర్ పేజీపై సముద్రపు ఒడ్డున గ్రేటా నిలబడినట్లుగా ఫొటోను టైమ్ మ్యాగజైన్ తన కవర్ పేజీపై ఉంచింది. టైమ్స్ మ్యాగజైన్ ఈ ప్రకటన చేసే కొద్దిసేపటి ముందు మాడ్రిడ్ లో జరిగిన యూఎన్ వాతావరణ మార్పు సదస్సులో గ్రేటా థన్ బర్గ్ మాట్లాడుతూ…భూగ్రహం భవిష్యత్తు వచ్చే దశాబ్దం తెలియజేస్తుందని తెలిపింది. అంతేకాకుండా ప్రపంచదేశాల నాయకులు నిజమైన చర్యను నివారించడానికి “సృజనాత్మక పిఆర్” వాడటం మానేయాలని కోరింది.

ట్రెండింగ్ వార్తలు