US-Mexico Border wall : అమెరికాలో ప్రవేశించేందుకు సరిహద్దు గోడ దూకిన భారతీయ కుటుంబం..భర్త మృతి, భార్య పిల్లలకు గాయాలు

అమెరికా - మెక్సికో సరిహద్దులో ఉండే గోడ దూకి అమెరికాలో ప్రవేశించాలనుకున్న ఓ భారతీయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోగా..భార్యా,కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్,మెక్సికో సరిహద్దుల్లో 'ట్రంప్ వాల్' దూకటానియి యత్నించగా ఈ విషాదం జరిగింది.

US-Mexico Border wall

US-Mexico Border wall : అమెరికా – మెక్సికో సరిహద్దులో ఉండే గోడ దూకి అమెరికాలో ప్రవేశించాలనుకుంది ఓ భారతీయ కుటుంబం. కానీ  ఈ ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. యూఎస్,మెక్సికో సరిహద్దుల్లోని ‘ట్రంప్ వాల్’ అని పిలువబడే సరిహద్దు గోడను దూకటానికి యత్నించిన క్రమంలో గుజరాత్ కు చెందని ఓ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. భర్త చనిపోగా భార్యా, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి.

మెక్సికో వెళ్లిన ఓ గుజరాత్ కు చెందిన బ్రిజ్‌కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి కుటుంబంతో సహా యూఎస్-మెక్సికో  సరిహద్దు గోడ వద్దరు చేరుకున్నాడు. ఆ గోడ దూకి అమెరికాలో ప్రవేశించాలనుకున్నాడు . ఈ ఘటనలో బ్రిజ్‌కుమార్‌ యాదవ్‌ చనిపోయాడు. అతని భార్యా కొడుకుకి గాయాలపాలయ్యారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లాలోని కలోల్ ప్రాంతానికి చెందిన బ్రిజ్ కుమార్ జీఐడీసీలో పనిచేస్తున్నాడు. అతను మెక్సికో నుంచి అమెరికాలోకి (అక్రమంగా) ప్రవేశించటానికి ఓ ఏజెంట్ ను సంప్రదించాడు. అతని చెప్పినట్లుగా బ్రిజ్ కుమార్ అమెరికాలో ప్రవేశించటానికి మెక్సికోకు చేరుకున్నాడు భార్యా పిల్లలతో కలిసి. అలా యూఎస్- మెక్సికో సరిహద్దుల్లో ఉండే ‘ట్రంప్ వాల్’అని పిలవబడే వాల్ దూకటానికి యత్నించింది కుటుంబం.అది 30 అడుగుల ఎత్తున్న గోడ. అది దాటితే అమెరికాలోకి వెళ్లొచ్చు.

దానికోసం బ్రిజ్ కుమార్ సాహసం చేశారనే చెప్పాలి. ఈ 30 అడుగుల గోడ ఎక్కే క్రమంలో బ్రిజ్‌కుమార్‌ మరణించాడు. బ్రిజ్ కుమార్, అతని భార్య యూఎస్ గోడవైపుకు పడిపోగా..వారి మూడేళ్ల కుమారుడు మెక్సికో వైపు పడిపోయారు. అలా బ్రిజ్ కుమార్ ప్రాణాలు కోల్పోగా భార్యా కుమారుడు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై గాంధీనగర్‌ రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) వాస్తవాలను నిర్ధారించడానికి మరియు వ్యక్తుల అక్రమ వలసలకు పాల్పడిన ఏజెంట్లపై అవసరమైన చర్యలు తీసుకోవాలని విచారణకు ఆదేశించింది.‘బ్రిజ్‌కుమార్‌ తన కుటుంబంతో దేశం విడిచి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. వారు అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించారని తేలింది. ఇటువంటి అక్రమ వలసలను ప్రోత్సహించే ఏజెంట్ల మీద చర్యలు తీసుకుంటామని గుజరాత్ పోలీసులు చెబుతున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.’

కాగా..మెక్సికో నుంచి శరణార్థుల రాకను అడ్డుకోవటానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దేశ సరిహద్దులో 30 అడుగుల ఎత్తైన ఈ భారీ గోడను నిర్మించారు. కాగా గత జనవరి (2022)లో కలోల్‌లోని డింగుచా గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా అమెరికా-కెనడా సరిహద్దుల్లో విపరీతమైన చలి కారణంగా చనిపోయారు.