Nigeria Attack : నైజీరియా మార్కెట్ లో కాల్పులు..43మంది మృతి

వాయవ్య నైజీరియాలో కాల్పుల మోత మోగింది. నైజీరియాలోని సొకోటో రాష్ట్రంలోని గొరొన్యో టౌన్ లోని వీక్లీ మార్కెట్​లో ఆదివారం దుండగులు విచక్షణారహిరతంగా జరిపిన కాల్పుల్లో 43మంది మరణించారు.

Nigeria Attack వాయవ్య నైజీరియాలో కాల్పుల మోత మోగింది. నైజీరియాలోని సొకోటో రాష్ట్రంలోని గొరొన్యో టౌన్ లోని వీక్లీ మార్కెట్​లో ఆదివారం దుండగులు విచక్షణారహిరతంగా జరిపిన కాల్పుల్లో 43మంది మరణించారు. ఈ మేరకు సొకోటో గవర్నర్ అమిను వాజిరీ తంబువాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.

దాదాపు 200 మంది బందిపోటు ముఠా సభ్యులు ఆదివారం మోటార్ సైకిళ్లపై మార్కెట్‌లోకి చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, గోరొన్యో జనరల్‌ హాస్పిటల్ లో మార్చురీలో దాదాపు 60 మృతదేహాలు ఉన్నాయని, తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది గాయపడ్డారని స్థానిక వ్యాపారి అయిన ఇలియాస్‌ అబ్బా ఒక వార్తసంస్థకు తెలిపారు.

అయితే సరిగ్గా 10 రోజుల క్రితం నైజీరియా సరిహద్దులోని నైజర్‌కి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో కూడా ఇలాగే బందిపోట్లు మార్కెట్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు.

ALSO READ Lakhimpur Violence : లఖింపూర్ ఘటనపై బుధవారం సుప్రీం విచారణ

ట్రెండింగ్ వార్తలు