John Corcoran No Write No Reading (1)
Gunshot At Washington US : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఎదురు కాల్పులు జరపగా సదరు దుండగుడు మరణించాడు.
తూర్పు వాషింగ్టన్‌లోని ఫిన్లీలో బుధవారం (ఆగస్టు 26,8.2021) తెల్లవారు జామున ఓ దుండగుడు ఓ వాహనంలోవచ్చి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయాగా పోలీసులు జరిగిన ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందాడు. అనుమానితుడు ఉపయోగించిన ట్రక్కు పశ్చిమ రిచ్‌ల్యాండ్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కెన్నెవిక్ పోలీస్ కెప్టెన్ ఆరోన్ క్లెమ్ మాట్లాడుతు..దుండగుడు వాహనం లోపల నుంచే కాల్పులు జరిపాడని తెలిపారు. తాము కాల్పుల్లో నిందితుడు మరణించాడని..నిందితుడు ఉపయోగించిన ట్రక్కులో పేలుడు పదార్ధాలున్నాయని వెల్లడించారు. కాలిపోయిన ట్రక్కులో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం గుర్తించామన్నారు. దుండుగుడు జరిపిన కాల్పుల్లో చనిపోయినవారి రెండు మృతదేహాలను ఓఇంట్లో గుర్తించామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.