Hamas Chief Ismail Haniyeh : ఇజ్రాయెల్, హమాస్ గ్రూప్ మధ్య గత కొద్దినెలలుగా యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో తాజాగా హమాస్ గ్రూప్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని హమాస్ గ్రూప్ చీఫ్ ఇస్మాయిల్ హనియా నివాసంపై ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగింది. ఈ దాడిలో ఇస్మాయిల్ హనియా చనిపోయినట్లు బుధవారం హమాస్ వెల్లడించింది. మంగళవారం ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కీయన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని తన నివాసంకు చేరుకున్న తరువాత ఈ దాడి జరిగిందని, ఈ దాడిలో హనియా చనిపోయారని హమాస్ తెలిపింది. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ దాడికి సంబంధించిన వివరాల గురించి స్పష్టమైన సమాచారం లేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎఫ్పీ పేర్కొంది. ఈ దాడిలో హనియాతో పాటు ఆయన బాడీగార్డ్ కూడా మరణించినట్లు హమాస్ తెలిపింది.
Also Read : ఘాట్స్ ఓన్ స్టేట్ కేరళలో జలప్రళయం.. ప్రకృతి ప్రకోపమా.. మానవ తప్పిదమా.?
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం కీలక దశలోఉన్న వేళ ఇస్మాయిల్ మృతి హమాస్ కు భారీ ఎదురుదెబ్బగా మారింది. తాజా పరిణామంతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏమైనా ప్రతీకారం తీర్చుకుంటుందా అనే అంశం పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మరోవైపు హమాస్ ప్రతీకార దాడులకు దిగేందుకు అవకాశం ఉండటంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.
ఇస్మాయిల్ మరణంపై హమాస్ నాయకుడు అబు జుహరి ఒక ప్రకటన విడుదల చేశాడు. మా చీఫ్ హనియా హత్య ఇజ్రాయెల్ లో అనుకున్న ఫలితాలను ఇవ్వదని హమాస్ పేర్కొంది. ఏ నాయకుడు చనిపోయినా హమాస్ ఉద్యమం కానసాగేంత బలంగా ఉందని తెలిపాడు.
Also Read : వయనాడ్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. 12 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
Hamas Political Bureau Chief Ismail Haniyeh killed in Tehran: Islamic Revolutionary Guard Corps confirms
Read @ANI Story | https://t.co/WNM8oiMoI2#Hamas #Iran #IRGC #IsmailHaniyeh pic.twitter.com/kHh9uLlC8C
— ANI Digital (@ani_digital) July 31, 2024