వయనాడ్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. 12 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

వయనాడ్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. 12 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

Kerala Rescue Operation

Wayanad Landslide : వయనాడ్ లో ప్రకృతి కనీవిని ఎరగని రీతిలో విధ్వంసాన్ని సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో వంద మందికిపైగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్ల నుంచి తీసిన చిత్రాల్లో విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సహాయక చర్యల్లో వేగం పెంచినా కొద్ది మృతదేహాలు గుట్టలు గుట్టలుగా శిథిలా కింది నుంచి బయటపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా భారీ వర్షం రావడంతో రెస్య్కూ ఆపరేషన్ ను నిలిపివేశారు. బుధవారం ఉదయం తిరిగి సహాయక చర్యలను ప్రారంభించారు.

Also Read : అదరగొట్టిన సూర్య, రింకు.. ఇండియా వర్సెస్ శ్రీలంక మూడో టీ20 మ్యాచ్ హైలెట్స్ వీడియో వైరల్ ..

వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ బుధవారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో 156 మంది ప్రాణాలు కోల్పోయారు. 128 మంది వివిధ ఆస్పత్రుల్లో గాయాలతో చికిత్స పొందుతున్నారు. 116 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసినట్లు తెలిపారు. వయనాడ్ లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Also Read : IND vs SL : సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీ.. మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఆ రెండు ఓవర్లు.. వీడియో వైరల్

కేరళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే 24గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసరోగోడ్, కన్నూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో నేడు భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, త్రిసూర్, పతనంతిట్ట, కాసరగోడ్, ఎర్నాకులం, వాయనాడ్, పాలక్కాడ్, అలప్పుజా, ఇడుక్కి కొట్టాయం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మహాత్మాగాంధీ యూనివర్శిటీలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.