PM Modi in Paris : ఫ్రాన్సులో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు

ఫ్రాన్స్ దేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలు మిన్నంటాయి. ఫ్రాన్స్‌లోని లా సీన్ మ్యూజికేల్‌లో ప్రవాస భారతీయులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘దేశానికి దూరంగా ఉన్నప్పుడు భారత్ మాతా కీ జై వినడం సొంత ఇల్లులా అనిపిస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి పారిస్‌లోని ప్రవాస భారతీయులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు....

PM Modi in Paris

PM Modi in Paris : ఫ్రాన్స్ దేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలు మిన్నంటాయి. ఫ్రాన్స్‌లోని లా సీన్ మ్యూజికేల్‌లో ప్రవాస భారతీయులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘దేశానికి దూరంగా ఉన్నప్పుడు భారత్ మాతా కీ జై వినడం సొంత ఇల్లులా అనిపిస్తోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి పారిస్‌లోని ప్రవాస భారతీయులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. (Bharat Mata Ki Jai abroad)

PM Modi Big Announcements : వర్క్ వీసాలు, కొత్త కాన్సులేట్…ఫ్రాన్సులో మోదీ ప్రకటన

బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ భారత్, ఫ్రాన్స్ మధ్య విడదీయరాని స్నేహం గురించి ప్రస్థావించారు. ‘‘నేను చాలాసార్లు ఫ్రాన్స్‌కు వచ్చాను, కానీ ఈసారి నా పర్యటన ప్రత్యేకమైనది. రేపు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం. నేను ఫ్రాన్స్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు ఫ్రాన్స్ ప్రజలకు ధన్యవాదాలు. ఈ రోజు ఫ్రెంచ్ ప్రధాని నన్ను ఆహ్వానించారు. ఇది భారతదేశం మరియు ఫ్రాన్స్‌ల మధ్య విడదీయరాని స్నేహానికి ప్రతిబింబం’’ అని మోదీ పేర్కొన్నారు. (PM Modi in Paris)

PM Modi France visit: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఆ దేశ ప్రధాని

నేడు ప్రపంచం భారతదేశం సామర్ధ్యాన్ని చూస్తుందని, భారత్ జి20 అధ్యక్షుడిగా ఉందని మోదీ చెప్పారు. వాతావరణ మార్పులు. ఉగ్రవాద వ్యతిరేకత కోసం ప్రపంచం నేడు భారత్ వైపు చూస్తుందన్నారు. తన ప్రసంగం అనంతరం పారిస్‌లోని ఎలీసీ ప్యాలెస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిన్నర్‌కు వెళ్లారు.

Viral Video : ఆధ్యాత్మిక కార్యక్రమంలో దారుణం.. మహిళ అని కూడా చూడకుండా పైకి ఎత్తి ఎలా విసిరేశాడో చూడండి

తనకు ఆతిథ్యమిచ్చిన ఫ్రాన్స్ నాయకత్వానికి ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని రెండు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. శుక్రవారం పారిస్‌లో జరిగే బాస్టిల్ డే పరేడ్‌కు మోదీ శుక్రవారం అతిథిగా హాజరుకానున్నారు.