×
Ad

పాక్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి

పాకిస్థాన్ లో మళ్లీ బాంబులు ఘర్జించాయి. పాకిస్థాన్‌లో క్వెట్టాలో బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 7.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. హజర్‌గంజి సబ్జీ మండీ ప్రాంతంలో హజర్‌ కమ్యూనిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  
 

అత్యంత రద్దీగా ఉండే హజర్‌గంజీ కూరగాయల మార్కెట్‌లో ఉదయం ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించించటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలిసేలోపే 16 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసపత్రికి తరలించారు. కాగా పేలుడు ధాటికి స్థానికంగా ఉండే పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కాగా ఈ బాంబు దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.