La Tomatina Festival : అక్కడ ఏటా టమాటాలతో కొట్టుకుంటారు.. ఎందుకో తెలుసా?

ఏటా అక్కడ టమాటాల యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు టమాటాలు విసురుకుంటూ కొట్టుకుంటారు. అందుకోసం టన్నుల కొద్దీ టమాటాలు ఉపయోగిస్తారు. ఈ యుద్ధానికి కారణమైన ఓ కథను కూడా చెబుతారు.

La Tomatina Festival

La Tomatina Festival : మొన్నటి వరకూ టమాటాలు కొనడం గగనమైపోయింది. ధరలు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా టమాటాలతో స్పెయిన్‌లో కొట్టుకున్నారు. ఏటా ఆగస్టు చివరి బుధవారం జరిగే ఫుడ్ ఫైట్ ఫెస్టివల్ ‘లా టొమాటినా’ గ్రాండ్‌గా జరుపుకున్నారు.

Tomato price: హమ్మయ్య.. టమాటా ధర ఢమాల్.. కిలో టమాటా రూ. 10 మాత్రమే.. ఎక్కడో తెలుసా?

స్పెయిన్‌లో ఏటా ‘లా టొమాటినా’ పండుగ జరుపుకుంటారు. దీని కోసం కొన్ని కథలు చెబుతారు. 1945 లో ఓ కూరగాయల దుకాణం దగ్గర గొడవ జరిగిందట. గొడవ పడ్డవారు ఒకరిపై ఒకరు టమాటాలు విసురుకున్నారట. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద టమాటా యుద్ధానికి నాంది పలికిందని చెబుతారు. ఆగస్టు చివరి బుధవారం ఈ టమాటా యుద్ధం స్పెయిన్ వాలెన్సియా సమీపంలోని బునోల్‌లో జరుగుతుంది.

ఈ ఏడాది బునోల్ మొత్తం టమాటాలతో నిండిపోయింది. ఈ సంవత్సరం ఈ పండుగ 76 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ పండుగలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిమంది ఇక్కడికి రావడం విశేషం. ఇక్కడ ప్రజలు అధికంగా పండిన, తక్కువ నాణ్యత ఉన్న టమాటాలను ఒకిరిపై ఒకరు విసురుకుంటారు. ఇలా టమాటా ఫైట్ చేసేటపుడు కళ్లకు గాగుల్స్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

Tomato Price: హమ్మయ్య.. భారీగా తగ్గిన టమాటా ధర

ఉదయం 11 గంటలకు టమాటాలు ఉన్న ట్రక్కు ప్లాజా డెల్ ఫ్యూబ్లోకి వెళ్లినపుడు లా టొమాటినా పండుగ ప్రారంభం అవుతుంది. ఒకరిపై ఒకరు టమాటాలు విసురుకోవడం టమాటా రసం పిచికారి చేస్తూ సందడి చేస్తారు. ఇలా ఒక గంట ఈ ఫైట్ జరిగిన తరువాత వీధులను తిరిగి శుభ్రం చేసుకుంటారు. ఇక ఈసారి టమాటా యుద్ధంలో పాల్గొనేవారు విసిరేందుకు 120 టన్నుల టమాటాలు అందించారు. ఈ పండుగలో పాల్గొన్నాలంటే టిక్కెట్లు కొనాలి. ఒక టికెట్ 12 యూరోలు (1,076.75 ఇండియన్ కరెన్సీలో) ఉంటుంది. మొత్తానికి టిక్కెట్టు కొనుక్కుని మరీ టమాటాలతో కొట్టుకుంటారన్నమాట.