Hong Kong : డెల్టా భయం..బ్రిటన్ విమానాల రాకపై హాంకాంగ్ నిషేధం
యూకే నుంచి ప్యాసింజర్ విమానాల రాకను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది.
- venkaiahnaidu
- Published On : June 28, 2021 / 09:50 PM IST
Hong Kong
Hong Kong యూకే నుంచి ప్యాసింజర్ విమానాల రాకను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. గురువారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. డెల్టా వేరియంట్ వంటి కొత్త కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం హాంకాంగ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక,బ్రిటన్ లో కోవిడ్ మహమ్మారి పరిస్థితి మళ్లీ కొంత ఆందోళనకరంగా ఉందని.. అక్కడ డెల్టా వేరియంట్ వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ను అత్యధిక ప్రమాదకర కేటగిరీలో ఉంచినట్లు హాంకాంగ్ ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం బ్రిటన్ లో కనీసం రెండు గంటలకు మించి ఉన్నవారికి హాంకాంగ్లోకి ప్రవేశం ఉండదు.
కాగా, బ్రిటన్ నుంచి విమానాల రాకను హాంకాంగ్ నిషేధించడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మే వరకు కూడా బ్రిటన్ విమానాల రాకపై హాంకాంగ్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
