×
Ad

Bridge Collapse : చైనాలో ఇంజినీరింగ్ వైఫల్యం.. భారీ శబ్ధంతో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్

Bridge Collapse : చైనా - టిబెట్‌ను కలిపేందుకు ఇటీవల ప్రారంభించిన హాంగీ కీ బ్రిడ్జి ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది.

bridge collapse

Bridge Collapse : చైనా – టిబెట్‌ను కలిపేందుకు ఇటీవల ప్రారంభించిన హాంగీ కీ బ్రిడ్జి ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. ఈ బ్రిడ్జి కూలుతున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో చైనాలో ఇంజనీరిగ్ వైఫల్యం బట్టబయలైంది.

చైనా సియాచిన్ ప్రావిన్సులో టిబెట్ – చైనాను కలుపుతూ హాంగ్ కీ బ్రిడ్జిని నిర్మించారు. దీనిని కొద్దిరోజుల క్రితం ప్రారంభించారు. 758 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి సెంట్రల్ చైనాను టిబెట్ తో కలుపుతుంది. అయితే, ఈ బ్రిడ్జి మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలింది. క్షణాల్లో వంతెన కింద భూమి కుంగిపోవడం.. దాని ఫిల్లర్లు ఒరిగిపోవడం, అవన్నీ కూడా నదిలోకి కూలిపోయాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తయి సంవత్సరం కూడా కాలేదని స్థానిక మీడియా తెలిపింది. కొండచరియలు విరిగిపడటం వల్లే వంతెన కూలిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు స్థానిక మీడియా వివరించింది.

Also Read: Donald Trump : ట్రంప్ కొత్త రాగం.. హెచ్‌-1బీ వీసాలపై సంచలన ప్రకటన.. వారికి శుభవార్త

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కొండచరియలు విరిగిపడటం కూడా స్పష్టం రికార్డు అయింది. అవిపడిన వెంటనే భారీగా దూళి ఆకాశంలోకి ఎగజిమ్మింది. వంతెన శిథిలాలు గాల్లోకి ఎగిసిపడటం ఇందులో చూడొచ్చు. వంతెన కూలిన సమయంలో భారీ శబ్దంతోపాటు శిథిలాలు నదిలో పడిపోయి పెద్ద ఎత్తున వ్యర్థాలు పైకి లేచాయి. ఇండస్ట్రీయల్ సెక్టర్ లో తామెప్పుడూ ముందుంటామని చెప్పుకునే డ్రాగన్ దేశంలో ఇంత పెద్ద వంతెన నిర్మించిన కొద్దిరోజుల్లోనే కూలిపోవడం ఏంటని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.