Father Killed Daughter In Court : కోర్టులో జడ్జి ముందే కూతుర్ని కాల్చి చంపిన తండ్రి..

సాక్షాత్తు న్యాయస్థానంలోనే ఓ తండ్రి తన కన్న కూతుర్ని కాల్చి చంపాడో తండ్రి. వాంగ్ములం ఇవ్వటానికి వచ్చిన కూతుర్ని కోర్టు హాల్లోనే కాల్చి చంపాడు తండ్రి.

Father Killed Daughter In Court : సాక్షాత్తు న్యాయస్థానంలోనే ఓ తండ్రి తన కన్న కూతుర్ని కాల్చి చంపిన ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో చోటుచేసుకుంది. వాంగ్ములం ఇవ్వటానికి వచ్చిన కూతుర్ని కోర్టు హాల్లోనే కాల్చి చంపాడు తండ్రి. తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కూతురిపై కక్ష పెంచుకున్న తండ్రి కూతుర్ని కోర్టులోనే కాల్చిచంపాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

కరాచీ నగరంలోని పిరాబాద్‌కు చెందిన యువతి ఓడాక్టర్ ను ప్రేమించింది. వారి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.దీంతో ఆమె తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకుంది. దీంతో తల్లిదండ్రుల నుంచి తనకు ప్రమాదం ఉందని కోర్టును ఆశ్రయించింది. ఈక్రమంలో వాంగ్ములం ఇవ్వటానికి కోర్టుకు వచ్చింది.అదే సమయంలో వాంగ్ములం ఇవ్వటానికి వచ్చిన కూతుర్ని చూసిన తండ్రి ఆవేశంతో ఊగిపోయాడు. ముందే ప్లాన్ చేసినట్లుగా కూడా తెచ్చుకున్న తుపాకీతో కాల్చేశాడు. అంతే అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయిందిది. ఆ షాక్ నుంచి తేరుకున్న పోలీసులు తండ్రిని నియంత్రించటానికి యత్నించారు. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనలో యువతి అక్కడిక్కడే చనిపోగా ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తమకు ఇష్టంలేని వివాహం చేసుకుందని కక్ష కట్టి తండ్రే కూతున్ని కాల్చి చంపాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షబ్బీర్ సేథర్ తెలిపారు. ఇటువంటి పరువు పేరుతో జరిగే హత్యల వెనుక తండ్రి, లేదా సోదరులు ఉంటారని తెలిపారు. కాగా పాకిస్థాన్ లో ఇటువంటి పరువు హత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. పాకిస్థాన్‌లో ప్రతి సంవత్సరం వందలాదిమంది యువులు ఈ పరువు హత్యలకు బలి అవుతున్నారు. పాకిస్థాన్ మానవహక్కుల సంస్థ (హెచ్ఆర్‌సీపీ) తెలిపిన వివరాల ప్రకారంగా చూసుకుంటే..గత 10 ఏళ్లలో ఏడాదికి సగటున 650 పరువు హత్యలు జరిగాయి. వెలుగులోకి రాని ఇటువంటి ఘటనలు చాలానే ఉంటాయని హెచ్ ఆర్ సీ వెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు