భూమి మీద నూకలు మిగిలే ఉండాలి కానీ.. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా సురక్షితంగా బయటపడొచ్చు అంటారు. ప్రముఖ రేసర్ వరల్డ్ చాంపియన్ Ott Tanak విషయంలోనూ ఇదే జరిగింది. ఘోర ప్రమాదం జరిగినా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. వరల్డ్ చాంపియన్ Ott Tanak అతడి కో డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. Monte Carlo Rallyలో భాగంగా మిస్టర్ తనాక్ అతడి టీమ్ రేసింగ్ లో పాల్గొంది. వేగంగా వెళ్తున్న సమయంలో అదుపు తప్పింది. అంతే.. కారు గాల్లోకి లేచింది. పల్టీలు కొట్టింది. ఆ తర్వాత కొండను బలంగా ఢీకొట్టింది. కారులో Mr tanak, కో డ్రైవర్ Martin Jarveoja ఉన్నారు. స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని Ott Tanak ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పెద్ద ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాము. ఇది నిజంగా మిరాకిల్. వేగంగా కోలుకుంటున్నాం. త్వరలోనే రికవర్ అవుతాము” అని ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. 4 రోజుల వ్యవధిలోనే లక్షల మంది చూశారు. షేర్ చేశారు.
Also Read : #Coronavirus మందు కనిపెట్టా : ఇదే మెడిసిన్ అంటున్న తమిళ వైద్యుడు!
Here’s what happened this morning. ? But we are recovering well and will be fit soon. ?#WRC #RallyeMonteCarlo pic.twitter.com/tgDIX8IMzJ
— Ott Tänak (@OttTanak) January 24, 2020