అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే.. జిన్‌పింగ్‌కి పుతిన్‌ వీడియో కాల్.. ఎందుకంటే?

రష్యా-చైనా చాలా కాలంగా సత్సంబంధాలను బలపర్చుకుంటూ వస్తున్నాయి.

Russian President Vladimir Putin, Chinese President Xi

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కీలక సమావేశం నిర్వహించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.

వీడియో కాల్‌లో ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని క్రెమ్లిన్ విడుదల చేసింది. జిన్‌పింగ్‌ వైపుగా పుతిన్‌ చేతిని ఊపి హాయ్‌ చెబుతూ ఆయనను ‘డియర్‌ ఫ్రెండ్‌’ అని సంబోధించడం గమనార్హం.

రష్యా-చైనా భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారం వంటి అంశాల్లో కొత్త ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని వ్లాదిమిర్‌ పుతిన్ ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర నమ్మకం, మద్దతు, సమానత్వం, ఇరు దేశాల ప్రయోజనాలను ఆధారంగా చేసుకుని రష్యా-చైనా బంధాన్ని బలపర్చుకోవాలని అన్నారు.

రష్యా-చైనా చాలా కాలంగా సత్సంబంధాలను బలపర్చుకుంటూ వస్తున్నాయి. 2022లో యుక్రెయిన్‌లోకి పుతిన్ రష్యా దళాలను పంపిన తర్వాత కూడా రష్యా-చైనా మధ్య బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి రష్యా ఇంధనం, గ్యాస్‌ వంటి వాటికి చైనా ప్రధాన కొనుగోలుదారుగా మారింది.

చైనాను అమెరికా ప్రధాన పోటీదారుగా చూస్తోంది. అలాగే, తమ దేశానికి రష్యా వల్లే అధిక ముప్పు ఉందని అమెరికా భావిస్తోంది. గతంలో ట్రంప్ హయాంలో చైనా-అమెరికాకు మధ్య వాణిజ్య తలెత్తింది. ట్రంప్‌ తన నాలుగేళ్ల పదవీకాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారోనన్న ఆందోళనలో రష్యా-చైనా ఉన్నట్లు తెలుస్తోంది.

Cm Revanth Davos Tour : దావోస్ పర్యటనలో రేవంత్ ప్రభుత్వం తొలి ఒప్పందం.. తెలంగాణలో యూనిలివర్ కంపెనీ పెట్టబడులు