China
China : చైనాలోని ఓ గ్రామాన్ని జనాలు విడిచిపెట్టేయడంతో దెయ్యాల గ్రామంగా పేరుబడిపోయింది. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లు.. నిర్జనంగా మారిన వీధులు కనిపించేవి. అయితే ఇప్పుడా గ్రామం పరిస్థితి మారిపోయింది. అక్కడ ఏం జరిగింది?
Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ
చైనాలోని హౌటౌవాన్ గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1990 లలో మెజార్టీ ప్రజలు ఈ గ్రామం వదిలిపెట్టి పనుల కోసం పెద్ద నగరాలకు తరలి వెళ్లిపోయారు. ఈ గ్రామాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. 30 సంవత్సరాల పాటు ఎడారిలా మారిన హౌటౌవాన్ గ్రామం దెయ్యాల గ్రామంగా పేరుబడిపోయింది. అయితే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అందుకు కారణం ఆ గ్రామం మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లు, నిర్మాణాలపై పచ్చని మొక్కలు పెరిగి గ్రామం కళకళలాడుతోంది.
హౌటౌవాన్ మత్స్యకార గ్రామం ఒకప్పుడు చాలా సంపన్నంగా ఉండేదట. ఇప్పుడు గ్రీన్ హౌస్‌గా ఎలా మారిందని వైమానిక ఫోటోలు చూపిస్తున్నాయి. కాగా ఈ గ్రామంలో విద్యా సౌకర్యాలు లేవు. ఆహార పంపిణీలో సమస్యలు ఉన్నాయి. మెరుగైన సౌకర్యాలు లేకపోవడం వల్లే ప్రజలు ఈ గ్రామాన్ని విడిచిపెట్టారట. 2002 లో హౌటౌవాన్ అధికారికంగా జనావాసంగా ప్రకటించబడింది. 2021 లో 90,000 మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించారట. అయితే శిథిలావస్థలో ఉన్న భవనాల్లోకి ప్రవేశించే ముందు ఇంటి బయట సందర్శకులకు పలు జాగ్రత్తలు రాసి కనిపిస్తాయట.
This remote village on one of more than 400 islands in the Shengsi archipelago, was abandoned in the early 1990s as its 2,000 residents moved away. Since then, the once-bustling fishing village of Houtouwan has been overtaken by greenery
[?visuals_china]pic.twitter.com/tYQVRJB813
— Massimo (@Rainmaker1973) October 7, 2023