Diamonds : వజ్రాలకు భూమికి సంబంధమేంటి..? ఒక వజ్రం తయారవ్వడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో తెలుసా..?

వజ్రం. బంగారం, ప్లాటినం కంటే విలువైనది. చెక్కుచెదరనిది. ధరలోను సాటిలేనిది. వజ్రాల్లో పలు రంగులు ఉన్నా..దేని ప్రత్యేకద దానిదే. దేని చరిత్ర దానితే. వజ్రం అంటేనే ఓ వైబ్రేషన్. ఓ ఎమోషన్. ఓ రేంజ్. అటువంటి వజ్రాల గురించి అరుదైన విశేషాలు..

long process Diamond form in the earth

Diamonds : వజ్రం. బంగారం, ప్లాటినం కంటే విలువైనది. చెక్కుచెదరనిది. ధరలోను సాటిలేనిది. వజ్రాల్లో పలు రంగులు ఉన్నా..దేని ప్రత్యేకత దానిదే. దేని చరిత్ర దానిదే. వజ్రం అంటేనే ఓ వైబ్రేషన్. ఓ ఎమోషన్. ఓ రేంజ్. ఇలా చెప్పుకుంటు పోతే వజ్రం అంటే వజ్రమే..దానికి లేదు సాటి అని చెప్పి తీరాల్సిందే. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వజ్రాల గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి. వజ్రాలు మనుషులు తయారు చేసేవి కాదు. ఈ ప్రకృతి వనరుల్లో భాగం. భూమిలో ఏర్పడ్డ అంత్యంత విలువైన గొప్ప సంపద వజ్రాలు. అసలు వజ్రాలు ఎలా భూమీలోకి ఎలా వచ్చాయి..?అవి ఎలా ఏర్పడతాయి..?వాటి ఏర్పాటు వెనుక ఎన్నో ఆసక్తికర వింతలు, విశేషాలు ఉన్నాయనే విషయం బహుశా చాలామందికి తెలియదు. మరి ఆ వజ్రాల్లాంటి విశేషాలేంటో..ఆ ఇంట్రస్టింగ్‌ విషయాలేంటో తెలుసుకుందాం…

రైతుకు దొరకిన వజ్రం..రైతు కూలీకి దొరికన వజ్రం రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. అనే వార్తలు వింటుంటాం. ఏపీలోని కర్నూలు వంటి ప్రాంతాల్లో పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయనే వార్తలు తొలకరి వర్షాల సమయాల్లో వింటుంటాం. అసలు వజ్రాలకు భూమికి ఏంటి సంబంధం..వజ్రాలు భూమిపైకి ఎలా వస్తాయి..?దీని వెనుక జరిగే ప్రక్రియ ఏంటి? అనే విషయాలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఒక్క వజ్రం ఏర్పడటానికి కోట్ల సంవత్సరాలు పడతుందట..!! వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ..అందుకే వజ్రాలకు అంత డిమాండ్..

Expensive Teapot : వామ్మో..ఒక్క ఈ టీ పాట్ ధర రూ.24 కోట్లు ..

గట్టిగా ధృఢంగా ఉన్నవాటిని వజ్రంలా ఉందే అంటారు. అంటే వజ్రం అంత ధృఢంగా ఉంటుంది. భూమిలో లభ్యమైన వజ్రాన్ని సానబెట్టటం అనేది ఓ ఖరీదైన ప్రక్రియ. దానికి మంచి షేపు,మెరుపు రావాలంటే చాలా కష్టంతోను .. ఖరీదుతోను కూడుకున్న ప్రక్రియ..వజ్రాలకు అంత గట్టిదనం ఎలా వచ్చింది అంటే అపారమైన పీడనంతో పాటు ఒత్తిడి వల్ల తయారవ్వటమేనంటారు నిపుణులు. భూమిలో ఒక వజ్రం తయారుకావటానికి ఏకంగా వందల ఏళ్లు పడుతుందట..ఒక రాయి వజ్రంగా మారే పూర్తి ప్రక్రియకు ఒక బిలియన్ సంవత్సరం నుంచి .. 3.3 బిలియన్ సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఈ ప్రక్రియ భూమి వయస్సులో దాదాపు 25% నుండి 75% వరకు ఉంటుందట.. ఇది ఎంత ఆశ్చర్యమో కదా అనిపిస్తుంది.

అంతేకాకుండా వజ్రాలు భూమి బరువు కూడా భరించగలవని నిపుణులు చెబుతున్నారు. ఒక రాయి అరుదైన వజ్రంలా తయారు కావడానికి కొన్ని శతాబ్దాలు పడుతుందట.అలా వజ్రాలు మొదట భూమిలోని 170 కిలోమీటర్ల లోపల ఏర్పడతాయి. ఆ తర్వాత అగ్ని పర్వాతాలు బద్ధలయ్యే క్రమంలో బయటికి వస్తాయని. దీనికి కూడా పెద్ద ప్రక్రియ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వజ్రాలు భూమి అంతర్భాగంలో ఏర్పడి అవి భూమి ఉపరితలానికి అంటే దాదాపు భూమి పొరల లోపలికి రావటానికి అతి పెద్ద ప్రక్రియ ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ అధ్యయనాల ప్రకారంగా చూస్తే అగ్ని పర్వాతాల బద్ధలైన లావా రూపంలో బయటకు వస్తాయని తెలిపారు. అలా వజ్రాలు భూగర్భం నుంచి బయటకు వస్తాయట. ఇది చాలా చాలా క్లిష్టమైన ప్రక్రియగా నిపుణులు పేర్కొంటున్నారు. కాలక్రమేనా భూమి పై పొరలలోకి చేరుకుని భూమిపైకి వస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

అలా సాధారణ వజ్రాలే కాకుండా అరుదైన వజ్రాలు అని చెబతామే అంటువంటి వజ్రాలు తయారు కావడానికి మరింత ప్రక్రియ ఉంటుందట. అరుదైన వజ్రం పూర్తిగా తయారు కావడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుందట.అవి కిలో మీటర్ల భూమి లోపల నుంచి బయటకి రావాల్సి ఉంటుంది. భూగర్భంలో తయారైన వజ్రం భూమిపైకి వచ్చే ప్రక్రియలో భూమి పొరల్లో ఘర్షణ చోటుచేసుకుంటుందట. ఆ వజ్రాన్ని పైనకి నెట్టేందుకు భూమికి సరైన శక్తి కావాలి. ఇవి పైకి రావడానికి సరైన శక్తితో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి.

Flying Alien: ఎగురుతూ వచ్చిన 7 అడుగుల ఏలియన్, యువతి ముఖం తినేశాడట.. ఫొటో కూడా చూపిస్తున్న స్థానికులు

ఇదే అంశంపై శాస్త్రవేత్తల బృందం కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధలు జరుపుతున్నారు. దీంట్లో భాగంగా కొన్ని వందల ఏళ్ల క్రితం భూమిపై ఖండాలు వేరు వేరుగా చీలిపోయాయి. ఇదే క్రమంలో అగ్నిపర్వతాల్లో భారీ పేలుళ్లు సంభవించి వజ్రాలను పట్టుకుని ఉన్న కింబర్‌ లైట్స్ రాళ్లు భూమిపై పడ్డాయి. ఇక కాలక్రమేనా వ్రజాలు భూమిపై కనిపించడం మొదలయ్యాయని పరిశోధనలు చెబుతున్నారు. అందుకే వజ్రాలకు అంత ఖరీదు. అగ్నిపర్వంలోని లావా కూడా ఏమీ చేయలేనంత దృఢమైనవి కావట్టే అంత డిమాండ్.

వాస్తవానికి మీరు నిజమైన వజ్రాన్ని కొనుగోలు చేయాలనుకుంటే అది నిజమైన వజ్రమేనా..? అని నిర్ధారించుకోవడానికి..అది ఏర్పడటానికి మిలియన్లు లేదా బిలియన్ల సంవత్సరాలు పట్టిందని నిర్ధారించుకోవాలంటే నిపుణుల ద్వారా మాత్రమే తెలుసుకోగలం. దీని కోసం కొన్ని సంస్థలున్నాయి. అటువంటివారి సిఫార్సుతోనే వజ్రాలను కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

భూమిలో సహజ సిద్ధంగా లభ్యమైన ఒక్కో వజ్రం వెనుక ఒక్కో చరిత్ర ఉంటుంది. వేల ఏళ్ల చరిత్ర ఉంటుంది. వజ్రం తయారు కావటానికి ఎన్నో మరెన్నో క్లిష్టమైన ప్రక్రియలుంటాయి. అందుకే అంటారేమో పెద్దలు రాయి రత్నంగా మారాలంటే చాలా చాలా కష్టం ఉంటుందని. అది మనుషుల్లో వచ్చే మార్పుల విషయం గురించే కాదు నిజంగానే వజ్రం రూపొందే ప్రక్రియలో భాగం అని చాలామందికి తెలియదు. అందుకే వజ్రం అంటే వజ్రమే అని అనుకునేలా ఉంటుందట వజ్రాలు ఏర్పడే ప్రక్రియ.







                                    

ట్రెండింగ్ వార్తలు