పాకిస్థాన్‌ పౌరసత్వం ఎలా ఇస్తుంది? మైనార్టీలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి?

  • Publish Date - December 18, 2019 / 09:19 AM IST

భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. ప్రత్యేకించి అసోం ప్రజలు ఈ కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు రాష్ట్రాలు సైతం తప్పుబట్టాయి. మూడు పొరుగుదేశాల నుంచివచ్చే వలసదారులకు లబ్ధి చేకూరేలా భారత పౌరసత్వం లభించేలా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదంతో ప్రవేశపెట్టింది.

రాజ్యాంగ పరంగా మతపరమైన హక్కుల్లో మైనార్టీలకు భారత్ పొరుగుదేశాల్లో పౌరసత్వానికి ఎలాంటి చట్టాలను అమలు చేస్తున్నాయి. దయాది పాకిస్థాన్ తమ దేశంలోని మైనార్టీలకు ఎలాంటి చట్టాలను, నిబంధనలను అమలు చేస్తుందో ఓసారి చూద్దాం. 

భారత్‌తో పోలిస్తే పాక్ రాజ్యాంగ ఉపోద్ఘాతం ఎలా సరిపోతుంది?
భారత రాజ్యాంగ ఉపోద్ఘాతంలో ప్రధానంగా.. సార్వభౌమ అధికారం, సామ్యవాదం, లౌకిక వాదం, ప్రజ్యాస్వామ్యం, గణతంత్ర రాజ్యమని ప్రకటించింది. ఇందులో సామ్యవాదం, లౌకిక వాదం అనే పదాలు 1976, 42వ సవరణ ద్వారా వచ్చి చేరాయి. మరోవైపు ప్రపంచంలోని 60 రాజ్యాంగాలకు పైగా దేవుడిని సంబోదించేలా చట్టాలను అమలు చేస్తున్నాయి. అందులో జర్మనీ, బ్రెజిల్, గ్రీస్, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ రాజ్యాంగం ‘అల్లాహ్’ పేరుతో తొలుత ప్రారంభమైంది.

అంటే.. అత్యంత లబ్ధిదారుడు, దయగలవాడు’ అని ప్రారంభమవుతుంది. దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తుంది. ముస్లింలు ఇస్లాంకు సంబంధించి ఇందులో సూచనలు ఉన్నాయి. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్‌లోని ఈ నిబంధనను మార్చి 12, 1949న లియాఖత్ అలీ ఖాన్ అమల్లోకి తీసుకురావడంపై అప్పట్లో రాజ్యాంగ నిర్మాణసభలోని ముస్లీయేతర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీస్ చంద్ర చటోపాధ్యాయ మాట్లాడుతూ.. దేశంలో మతానికి చోటు లేదన్నారు. స్టేట్ రీలిజియన్ ప్రమాదకరమైన సూత్రంగా ఆయన వ్యతిరేకించారు.   

మతపరంగానే పాక్ పౌరసత్వాన్ని ఇస్తుందా? :
ఇస్లామిక్ స్టేట్ అయినప్పటికీ పాకిస్థాన్ దేశంలో పౌరసత్వం కోసం ఏ మతపరమైన పరీక్ష లేదు. 1951, దేశ పౌరసత్వ చట్టం.. భారత పౌరసత్వ చట్టానికి దాదాపు సమానంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా జనవరి 1, 1952 నాటికి పాకిస్థాన్‌కు వలస వస్తే.. అట్టి వ్యక్తి.. పాక్ పౌరసత్వాన్ని పొందవచ్చు అని సెక్షన్ 6లో పేర్కొంది. సెక్షన్ 3 ప్రారంభ చట్టం (ఏప్రిల్ 13, 1951) ప్రకారం.. మార్చి 31, 1973 నాటికి పాకిస్థాన్ సహా సరిహద్దు ప్రాంతాల్లో జన్మించిన వారిలో ఎవరైనా తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల్లో ఒకరైనా ఉంటే వారందరికి పాక్ పౌరసత్వం లభిస్తుంది.

ఏప్రిల్ 13, 1951 (1948, జూలై 19న భారత్ నుంచి విడిపోయాక.. అసోం మినహా మార్చి 25, 1971)లో పాకిస్థాన్ వలసగా వచ్చిన వారందరికి పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చింది. అదే.. భారత చట్టం మాదిరిగా పాకిస్థాన్‌లో సెక్షన్ 7 ప్రకారం.. 1947, మార్చి 1 తర్వాత పాక్ నుంచి భారత్‌కు వలసగా వెళ్లిన వ్యక్తి.. తమ దేశీయ పౌరుడు కాదని, ఇందులో (పునరావాసం కింద లేదా శాశ్వతంగా) దేశానికి తిరిగిరావాలనుకునే వారు మినహా అని పేర్కొంది.  

పాకిస్తాన్ చట్టంలోని సెక్షన్ 4 చట్టం ప్రారంభమైన తరువాత పాకిస్తాన్‌లో జన్మించిన ప్రతి వ్యక్తి పుట్టుకతోనే పాకిస్తాన్ పౌరుడిగా ఉండాల్సి ఉండగా, ఇండియాలో 1986లో సవరణల ద్వారా నిర్బంధ అర్హతలను జోడించింది. అంటే.. (ఒక తల్లిదండ్రులు భారతీయ పౌరులుగా ఉండాలి) 2003 ప్రకారం.. (తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయ పౌరులు, లేదా ఒక పౌరుడు, మరొకరు అక్రమ వలసదారుడు కాకూడదు). అని ఉంది.

పాకిస్తాన్ చట్టంలోని సెక్షన్ 5లో.. ఒక వ్యక్తి జన్మించిన సమయంలో తల్లిదండ్రులలో ఒకరు పాకిస్థాన్ పౌరులైతే వారసత్వం ద్వారా వారి పౌరసత్వం ఇస్తుంది. పాకిస్థాన్‌తో కాశ్మీర్ సంబంధాలు కొనసాగింనంతవరకు పాకిస్థాన్‌కు జమ్మూ, కాశ్మీర్ వలసదారులు పాకిస్తాన్ పౌరులుగా భావిస్తారు. బ్రిటీష్ నివాసితులు కూడా అదేవిధంగా పౌరులుగా భావించారు. కామన్వెల్త్ పౌరులకు కూడా ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వవచ్చు.

పాక్, భారత్ మత స్వేచ్ఛ విధానంలో భిన్నమైంది ఏంటి?
భారత రాజ్యాంగం ఉపోద్ఘాతం మాదిరిగా కాకుండా, పాకిస్థాన్ రాజ్యాంగం ఉపోద్ఘాతంలో స్పష్టంగా పేర్కొంది. మైనారిటీలకు స్వేచ్ఛగా ప్రకటించడానికి, మత స్వేచ్ఛను ఆచరించడానికి, వారి సంస్కృతిని అభివృద్ధి చేయడానికి తగిన సదుపాయం కల్పించింది.

ఇండియాకు భిన్నంగా, పాకిస్థాన్ మత స్వేచ్ఛ విషయంలో పౌరులకు మాత్రమే హక్కు ఇస్తుంది. దేశంలో విదేశీయులతో సహా ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది. అందుకే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే హక్కు విదేశీ మిషనరీలకు ఉంది.  

భారత్‌లా కాకుండా, పాకిస్థాన్‌లో వాక్ స్వాతంత్య్రం ప్రత్యేకంగా పత్రికా స్వేచ్ఛను కలిగి ఉంటుంది. కానీ ఇది ‘ఇస్లాం కీర్తి’కి లోబడి ఉంటుంది. ఈ పరిమితి కారణంగా, పాకిస్తాన్ తప్పనిసరి మరణశిక్షతో తిరోగమన దైవదూషణ చట్టాన్ని కలిగి ఉంది. ఇది ఇస్లామిక్ క్రిమినల్ చట్టం ప్రాథమిక సూత్రాలకు కూడా విరుద్ధంగా నడుస్తుంది. 

మైనారిటీల ‘చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం పాక్ ఏ చర్యలు తీసుకుంది?
ఫెడరల్, ప్రావిన్షియల్ సేవలలో మైనారిటీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను రాష్ట్రం పరిరక్షించాలని ఆర్టికల్ 36లో పేర్కొంది. మతపరమైన మైనారిటీలు వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ, రాజ్యాంగం వారికి రిజర్వేషన్లు కల్పిస్తుంది. జాతీయ అసెంబ్లీలో 10 సీట్లు వారికి కేటాయించడం జరిగింది.

బలూచిస్తాన్‌లో, మతపరమైన మైనారిటీలు జనాభాలో కేవలం 1.25శాతం మాత్రమే ఉన్నప్పటికీ, వారికి రిజర్వేషన్లు 4.62శాతంగా ఇచ్చింది. పంజాబ్ ప్రాంతాల్లోని వారు 2.79శాతం, రిజర్వేషన్లు 2.16శాతంగా ఇచ్చింది. ఇక సింధ్‌లో 8.69శాతం జనాభా ఉంటే, రిజర్వేషన్లు 5.36శాతంగా ఇచ్చింది.

కానీ, నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లో 2.46శాతంగా జనాభా ఉంటే.. రిజర్వేషన్లు కేవలం 0.56శాతం మాత్రమే కలిగి ఉన్నారు. విభజన తరువాత 5 మిలియన్ల మంది భారతదేశానికి వలస వచ్చిన తరువాత 1951లో పశ్చిమ పాకిస్తాన్ లోని హిందువులు (నేటి పాకిస్తాన్) కేవలం 3.44 శాతంగా మాత్రమే ఉన్నారు. 1961 జనాభా లెక్కల ప్రకారం.. నేటి పాకిస్తాన్‌లో ముస్లిమేతర జనాభా 2.83 శాతానికి తగ్గింది. ఇది 1972లో 3.25 శాతానికి, 1981లో 3.30 శాతానికి, 1998లో 3.70 శాతానికి పెరిగింది.

పాక్‌లో మతపరమైన మైనారిటీలకు వ్యక్తిగత చట్టాలు ఉన్నాయా?
అంటే.. అవుననే చెప్పాలి. ప్రస్తుతం పాకిస్థాన్ లో మతపరమైన మైనార్టీలకు వ్యక్తిగత చట్టాలను అమలు చేస్తోంది. రాష్ట్ర మతానికి విరుద్ధమైన చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ఒక నిబంధన ఉన్నప్పటికీ, పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 (3) మైనారిటీల వ్యక్తిగత చట్టాన్ని ఈ నిబంధన నుంచి మినహాయించింది.

భారత్‌లో, రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యక్తిగత చట్టానికి ఏ నిబంధన లేదు. 2017లోనే ట్రిపుల్ తలాక్ చెల్లదని ప్రకటించబడింది కూడా. పాకిస్థాన్‌లో అత్యధిక హిందువులను కలిగి ఉన్న సింధ్ ప్రావిన్స్.. బలవంతపు మతమార్పిడిని నిషేధించే చట్టాన్ని 2016లో ఆమోదించింది. పంజాబ్ అసెంబ్లీ సిక్కు ఆనంద్ వివాహ చట్టాన్ని కూడా 2018లో అమలు చేయడం జరిగింది.