Hurricane Ida
Hurricane Ida: హారికేన్ కత్రినా గుర్తుందా.. 16 ఏళ్ల క్రితం అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన కత్రినా హరికేన్ అంటే ఇప్పటికే అమెరికన్ల గుండెల్లో గుబులు రేగుతుంది. కాగా, ఇప్పుడు కత్రినా హారికేన్ ను మించిన హారికేన్ ఒకటి అమెరికా మీద విరుచుకుపడుతుంది. హరికేన్ ఐదా( Hurricane Ida) తాజాగా అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో తీరాన్ని దాటింది. ఈ ఐదా హరికేన్ గంటకు 241 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో ఈ హరికేన్ ఐదా ధాటికి లూసియానా రాష్ట్రం వణికిపోతోంది.
ఇప్పటి వరకూ దేశాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్లలో ఇది కూడా ఒకటని ఇక్కడి నిపుణులు విశ్లేషణ చేస్తుండగా.. ఈ హారికేన్ ఏకంగా మిసిసిపీ నదీ ప్రవాహాన్నే రివర్స్ చేసిందంటే ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు. భయంకరమైన ఈదురు గాలులకు లూసియానా రాష్ట్రం చిగురుటాకులా వణికిపోగా ఈ భయానక హరికేన్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని ఆస్ట్రోనాట్లు ఫొటోలు తీయగా.. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఆస్ట్రోనాట్ థామస్ పెస్కెట్ ఈ ఫొటోలను రిలీజ్ చేశారు.
తీరం దాటే ముందు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఉన్న తుఫాను తీరం దాటే సమయంలో అంతరిక్షం నుంచి చాలా భయానకంగా కనిపించింది. మరో ఆస్ట్రోనాట్ మేగన్ ఆర్థర్ కూడా ఈ హరికేన్ ఫొటోలను తీయగా వాటిని కూడా ట్విటర్‌లో షేర్ చేశారు. అమెరికాలో పర్యావరణ మార్పుల కారణంగా ఇలాంటి భారీ హరికేన్లు ఇక్కడి తీరాన్ని తాకడం సహజమే కాగా.. దీనిపై ఆస్ట్రోనాట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హరికేన్ ఐదా ప్రభావంతో ఈదురు గాలులు.. మిసిసిపీ నదీ రివర్స్ లో ప్రవహించడం.. హరికేన్ తీరం దాటే సమయంలో సృష్టించిన బీభత్సం ఫోటోలు, వీడియోలను అమెరికన్ ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆందోళన చెందుతున్నారు.