UK PM Rishi Sunak: నేనూ యూకేలో జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నాను: ఆ దేశ ప్రధాని రిషి సునక్

‘‘నా గతాన్ని గుర్తుకు తెచ్చుకుని చెప్పాలంటే నేను కూడా బాల్యంలో, యువకుడిగా ఉన్న సమయంలో జాత్యహంకార ఘటనను ఎదుర్కొన్నాను. అయితే, యూకేలో ఇప్పుడు అలాంటి ఘటనలు జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు. జాతి వివక్షను అరికట్టే విషయంలో దేశం ఇప్పుడు చాలా పురోగమించింది’’ అని రిషి సునక్ చెప్పారు.

UK PM Rishi Sunak: యూకేలో తనకు కూడా ఒకప్పుడు కొందరి నుంచి జాత్యహంకార అనుభవం ఎదురైందని ఆ దేశ ప్రధాని, భారత సంతతి నేత రిషి సునక్ చెప్పారు. ఇటీవల యూకేలో బకింగ్‌హామ్ ప్యాలెస్ లో జాత్యహంకార ఘటన చోటుచేసుకుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై రిషి సునక్ ను మీడియా ప్రశ్నించగా, ప్రధానిగా ఉన్న తాను రాయల్ ప్యాలెస్ విషయాలపై మాట్లాడడం సరికాదని చెప్పారు. అయితే, తాను గతంలో ఎదుర్కొన్న ఓ ఘటన గురించి మాట్లాడారు.

‘‘నా గతాన్ని గుర్తుకు తెచ్చుకుని చెప్పాలంటే నేను కూడా బాల్యంలో, యువకుడిగా ఉన్న సమయంలో జాత్యహంకార ఘటనను ఎదుర్కొన్నాను. అయితే, యూకేలో ఇప్పుడు అలాంటి ఘటనలు జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు. జాతి వివక్షను అరికట్టే విషయంలో దేశం ఇప్పుడు చాలా పురోగమించింది’’ అని రిషి సునక్ చెప్పారు.

Ricky Ponting: కామెంటరీ చేస్తున్న సమయంలో రికీ పాంటింగ్‌కు గుండెపోటు?.. ఆసుపత్రికి తరలింపు

జాత్యహంకార ఘటనలు ఎక్కడ జరిగినా, వాటిని ఎదురించాల్సిందేనని ఆయన అన్నారు. గత అనుభవాలను నుంచి పాఠాలు నేర్చుకుని, బంగారు భవిషత్తు కోసం ప్రయత్నించాలని చెప్పారు. కాగా, రిషి సునక్ కొన్ని వారాల క్రితం యూకే ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు