సముద్ర తీరాల్లో ఏం కనిపిస్తాయి..అంటే గవ్వలు..శంకాలు..నత్త గుల్లలు వంటివి కనిపిస్తాయి. కానీ ఓ బీచ్ లో కళ్లను కట్టి పడేసే అంత్యంత అద్భుతమైన..అరుదైన దృశ్యం కనిపించింది. కనువిందు చేసింది. బీచ్ లో వేల సంఖ్యలో ఉన్న ‘గుడ్లు’ చూసి నోరెళ్ల బెట్టారు. ఆసక్తి దగ్గరకెళ్లి చూస్తే అవి నిజమైన గుడ్లు కాదు సహజ సిద్ధంగా ప్రకృతి పెట్టిన ‘గుడ్లు’. అదేంటి ప్రకృతి ‘గుడ్లు’ పెట్టటమేంటి అనే డౌట్ రావచ్చు. అవి మంచు ‘గుడ్లు’!!.ఆ మంచు గుడ్లను చూసి పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన దృశ్యం ఫిన్‌ల్యాండ్‌లోని మార్జనిమి బీచ్ పర్యాటకుల్ని కట్టి పడేస్తోంది. వాటిని తమ కెమేరాల్లో బంధిస్తు సంబరపడిపోతున్నారు.
ఫిన్‌ల్యాండ్‌లోని మార్జనిమి బీచ్‌లో 100 అడుగుల విస్తీర్ణంలో వేల సంఖ్యలో ఈ మంచు ‘గుడ్లు’ కనిపించాయి. వీటిని చూసిన పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. వాటిని దగ్గరకు వెళ్లి చూస్తే..అవి గుడ్లు కాదు, మంచు ముద్దలని తెలిసింది.
రిస్తో మట్టిలా అనే పర్యాటకుడు తన భార్యతో కలిసి హైలుటో దీవిలోని మార్జనిమి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ బీచ్ లో ఈ మంచు గుడ్లు కనువిందు చేశాయి. ఆ మంచు గుడ్లు ఫుట్‌బాల్ నుంచి క్రికెట్ బాల్ సైజుల్లో ఉన్నాయి. వాటిని వెంటనే ఆ ఫొటోను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ మంచు గుడ్లను చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. వాహ్..ప్రకృతి ఏమి చిత్రమైనది అంటూ ఆశ్చర్యానందాలలో మునిగిపోతున్నారు.
ఈ మంచు గుడ్లు విషయంలో ఫిన్నిష్ మెట్రోలాజికల్ ఇన్స్టిట్యూట్ స్పెషలిస్ట్ జౌని వైనియో మాట్లాడుతూ..వాతావరణంలో వస్తున్న మార్పులను బట్టి..సంవత్సరానికి ఒకసారి ఇటువంటి మంచుగుడ్లు ఏర్పడతాయని తెలిపారు. వాతావరణం ‘0’ డిగ్రీలకు చేరినప్పుడు సముద్రంలో నీరు కూడా గడ్డ కడుతుంది. ఆ సమయంలో కెరాటాల కదలికలు కూడా నెమ్మదిగా ఉంటాయి. ఆ కెరటాలు గడ్డకట్టిన నీటిని వెనక్కి ముందుకు తిప్పుతూ.. ఒడ్డుకు చేర్చుతాయి. దీంతో అవి గుడ్డు ఆకారంలో ఆకర్షనీయంగా మారతాయని తెలిపారు.