అమెరికా ఆందోళనలతో అట్టుడికిపోతోంది. పోలీసుల హింసకు వ్యతిరేకంగా అక్కడి వారంతా దేశవ్యాప్తంగా తమ స్మార్ట్ ఫోన్లతో రికార్డు చేస్తున్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుస్తూ అక్కడి వారంతా ప్రొఫెషనల్ జర్నలిస్టుల మాదిరిగా వీడియో రికార్డు చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ పోలీసుల దౌర్జన్యాన్ని రికార్డు చేస్తూ తమ హక్కులను కాపాడుకుంటున్నారు. అమెరికాలో మొత్తంగా 50 రాష్ట్రాల్లో శాంతియుతంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసులు అక్రమంగా ప్రజలను చావబాదుతున్నారంటూ చాలామంది రికార్డు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పోలీసుల దౌర్జన్యాన్ని నిరసకారులంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అక్రమంగా తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
పోలీసుల చర్యను కేవలం వీడియోలు రికార్డు చేయడంతో న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ లేదు. కానీ, పోలీసులు హింస ఎంత స్థాయిలో పెరిగిపోయిందో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే కనిపిస్తోందని అంటున్నారు. ఈ నెల (జూన్ 4న) ఓ 75 ఏళ్ల వృద్ధుడు కొంతమందితో మాట్లాడుతున్న కనిపించడంతో ఇద్దరు న్యూయార్క్ పోలీసు అధికారులు అతన్ని కింది పడేసి తలను నేలకేసి కొట్టినట్టు వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో బాధితుడి చెవి నుంచి రక్తం రోడ్డుపై పారుతుండగా.. కొంతమంది అధికారులు దానిపై నుంచి నడుచుకుంటూ పోయిన దృశ్యం షాకింగ్ గురిచేసింది.
Read: అమెరికాలో మరో దారుణం…వృద్ధుడిపై పోలీసుల క్రూరత్వం
ఈ వీడియోను WBFO కు చెందిన Mike Desmond అనే వ్యక్తి రికార్డు చేసి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి వెంటనే Buffalo మేయర్ Byron Brown విచారణకు ఆదేశించారు. ఈ చర్యకు పాల్పడిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. పోలీసుల చర్యలను రికార్డు చేయడం ద్వారా న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ లేదని బాధితులు వాపోతున్నారు. బ్లాక్ అండ్ బ్రౌన్ జాతీయులే ఎక్కువగా వీరిలో బాధితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు దురుసుతనంపై వీడియో రికార్డు చేసినప్పటికీ అరుదుగా మాత్రమే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కానీ, ఎలాంటి ఆధారం లేకుంటే మాత్రం పోలీసులదే పైచేయి అవుతుంది. వారు చెప్పేదానికి విలువ ఉంటుంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే బాధితుల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
This incident is wholly unjustified and utterly disgraceful.
I’ve spoken with Buffalo @MayorByronBrown and we agree that the officers involved should be immediately suspended pending a formal investigation.
Police Officers must enforce — NOT ABUSE — the law. https://t.co/EYIbTlXnPt
— Andrew Cuomo (@NYGovCuomo) June 5, 2020
పోలీసుల హింసను రికార్డు చేసే హక్కు మీకుంది :
యూనైటెడ్ స్టేట్స్‌లో ఒక పౌరుడు లేదా నివాసి ప్రతిఒక్కరికి రాజ్యాంగ పరంగా పోలీసుల హింసను రికార్డు చేసే హక్కు ఉంటుంది. అలాగే.. పోలీసులు కూడా తమ విధులకు అటంకం కలిగించనంత వరకు ఎవరిని అడ్డుకునే హక్కు లేదు. అంతేకాదు.. తమను రికార్డు చేస్తున్నారని మీ చేతుల్లోని ఫోన్ లేదా కెమెరాను లాక్కొనే అధికారం కూడా వారికి లేదంటున్నారు. ఫెడరల్ కోర్టులు, సుప్రీంకోర్టులు కూడా ఇదే చెబుతున్నాయని అంటున్నారు. 2014లో (9-0 నిర్ణయం) ప్రకారం.. మీ సెల్ ఫోన్ సెర్చ్ చేయడం లేదా సీజ్ చేయాలంటే కచ్చితంగా పోలీసులకు వారెంట్ తప్పక ఉండాలి. ప్రస్తుతం అమెరికా అందోళనలలో కూడా పోలీసులు పౌర హక్కులను కాలరాస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పోలీసులు వారి హక్కును గౌరవిస్తారన్న గ్యారెంటీ కూడా లేదు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా మీరు ఏదైనా వీడియోను రికార్డు చేసి పోస్టు చేయాలనకుంటే.. మీడియాను సంప్రదించవచ్చు. మీ ఐడెంటినీ ప్రొటెక్ట్ చేస్తూ వీడియోను ప్రసారం చేసే అవకాశం ఉంటుంది.
* ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
* మీరు పబ్లిక్‌లో ఎక్కువ సమయం ఉండాల్సి వచ్చినప్పుడు.. మీ వెంట ఒక ఛార్జర్ ఉంచుకోండి లేదా అదనంగా ఫోన్ బ్యాటరీ తీసుకెళ్లండి.
* మీ ఫోన్ తో పాటు అదనంగా మరో ఫోన్ లేదా డివైజ్ తీసుకెళ్లండి. మీ ప్రైవరీ డివైజ్ కు బదులుగా వీటిని వినియోగించండి.
* ఎందుకంటే.. మీ సొంత ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్తే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
* మీ ఫోన్ ఎప్పుడూ లాక్ ఉండేలా జాగ్రత్త పడండి. ఎవరైనా మీ ఫోన్ లాక్కున్నా వారు దాన్ని యాక్సస్ చేయలేరు.
* తెల్లవారికే ఫోన్ రికార్డ్ చేసే బాధ్యత ఉంది :
పోలీసుల హింసను రికార్డు చేసే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుంది. కానీ, అందరికి సమానంగా ఉండదు. అట్టుడుగువారిలో ఎవరైనా తెల్లవారి కంటే ఇలా పోలీసులను రికార్డింగ్ చేస్తే మాత్రం ప్రమాదంలో పడతారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. Eric Garner అనే వ్యక్తి.. పోలీసుల చర్యను రికార్డు చేసాడనే కారణంతో అతడ్ని వేటాడి హింసించి జైల్లో పెట్టి చంపేశారు అక్కడి పోలీసులు.