Imran Khan: ఒసామా బిన్ లాడెన్‌ను అమర వీరుడంటూ పొగిడిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. 9/11 ఉగ్రదాడులకు, 2001 అమెరికా దాడులకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడంటూ సంబోధించారు. పాక్ పార్లమెంట్, నేషనల్ అసెంబ్లీ వేదికగా 2020లో అన్నారు.

Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. 9/11 ఉగ్రదాడులకు, 2001 అమెరికా దాడులకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడంటూ సంబోధించారు. పాక్ పార్లమెంట్, నేషనల్ అసెంబ్లీ వేదికగా 2020లో అన్నారు. దీనిపై అఫ్ఘనిస్తాన్ టీవీ ఛానెల్ చేసి ఇంటర్వ్యూలో పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్ముద్ ఖురేషీని ప్రశ్నించారు రిపోర్టర్.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి.. ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడని ఎలా అన్నారని జర్నలిస్టు లోట్ఫుల్లా నజాఫిజాదా ప్రశ్నించారు. దాటేస్తూ ప్రతి మీడియా దీనినే హైలెట్ చేస్తుందని అన్నారు. మరోసారి ప్రశ్నిస్తూ.. ఒక ఉగ్రదాడికి కారణమైన వ్యక్తిని అమరవీరుడని ఎలా అంటారంటూ ప్రశ్నించగా.. దాన్ని వదిలేయండి అని తోసిపుచ్చారు ఆయన.

ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా.. జూన్ 2020లో ‘అమెరికన్లు అబ్బోత్తాబాద్ లో చొరబడి ఒసామా బిన్ లాడెన్ ను చంపి అమరవీరుడ్ని చేసినప్పుడు పాకిస్తానీలు ఎంత ఇబ్బందిపడ్డారో మరచిపోను’ అని అన్నారు.

ఈ స్పీచ్ మొత్తం ఉర్దూలో ఉంది. లాడెన్ ను సంబోధిస్తూ షహీద్ (అమరవీరుడు) అని అన్నారు. ట్విన్ టవర్స్ పేలుడుకు కారణమై.. 3వేల మంది మరణాలకు, బాధ్యుడైన లాడెన్ ను అమెరికా బలగాలు సీక్రెట్ మిషన్ లో 2011లోనే తుదముట్టించాయి.

ట్రెండింగ్ వార్తలు