అమెరికా చేరుకున్న ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక విమానంలో అమెరికా చేరుకున్నారు. రెండ్రోజులుగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఇమ్రాన్.. సౌదీ అరేబియా రాకుమారుడైన మొహమ్మద్ బిన్ సల్మాన్ విమానంలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్లారు. సౌదీ రాకుమారుడే స్వయంగా తన విమానంలో వెళ్లాల్సిందేనని ఇమ్రాన్‌ను కోరాడట. ‘మీరు మా ప్రత్యేక అతిథి. అమెరికాకు మా విమానంలోనే వెళ్లాలి’ అని అడగడంతో పాక్ ప్రధాని అమెరికాకు ప్రయాణమయ్యారు. 

సెప్టెంబర్ 27న జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ఖాన్ హాజరుకావాల్సి ఉంది. అతను ప్రత్యేకించి కశ్మీర్ అంశంపై మాట్లాడతారని అందరిలోనూ ఉన్న ఆలోచనే. దీని కోసమే ఇటీవల విదేశీ పర్యటన చేస్తూ.. సపోర్ట్ సంపాదించుకుంటున్నాడు. 

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ.. ‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు చేరుకున్నారు. ఏడు రోజుల పర్యటనలో భాగంగా వెళ్లిన ఇమ్రాన్.. కశ్మీర్ అంశంపై ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అక్కడికి వెళ్లారు’ అని ఆయన తెలిపాడు. ఖాన్ సోమవారం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకోనున్నాడు.