Imran Khan Arrest: జాగ్రత్తగా వినండి, నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది.. అరెస్టుకు ముందు ఇమ్రాన్ వీడియో సందేశం

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అనంతరం పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్‭లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఖాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది

Imran Khan Arrest: తనను అరెస్టు చేయడానికి ముందు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఇచ్చిన వీడియో సందేశం నెట్టింట్లో వైరల్ అవుతోంది. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆ వీడియోలో ఇమ్రాన్ అన్నారు. నిజమైన స్వేచ్ఛ కోసం బయటికి రావాలంటూ పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన అరెస్ట్ జరుగుతుందని ముందుస్తుగా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో డబ్బే డబ్బు.. జస్ట్ అధికారులు పట్టుకున్నదే రూ.378 కోట్లు

వీడియో సందేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ‘‘నిజమైన స్వేచ్ఛ కోసం బయటకు రావాలని నా మద్దతుదారులను కోరుతున్నాను. నా అరెస్టుతో ఈ దేశం నిద్రపోతుందని వారు (అధికారంలో ఉన్నవారు) భావిస్తున్నారు. అది తప్పని మీరు నిరూపించాలి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నేను మీకోసం యుద్ధం చేస్తున్నాను. నా జీవితమంతా ఈ పోరాటం చేస్తాను. జాగ్రత్తగా వినండి, నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది’’ అని అన్నారు.


కాగా, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అనంతరం పాకిస్తాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్‭లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఖాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ప్రపంచ ట్విట్టర్ ట్రెండులో ఇమ్రాన్ ఖాన్ (#ImranKhan) అనే హ్యాష్‭ట్యాగ్ టాపులో ఉంది. ఇమ్రాన్‭ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియోలను ఫొటోలను షేర్ చేస్తూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు