అభినందన్ ను అప్పగిస్తున్నందుకు:ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట

  • Publish Date - March 1, 2019 / 09:48 AM IST

పాకిస్థాన్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు  నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. భారత పైలెట్ కమాండర్ అభినందన్ విడుదలకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోవటం చాలా గొప్ప విషయమనీ..భారత్ తో శాంతిని కోరుకుంటు అభినందన్ కు విడుదల చేయటం హర్షించాల్సి విషమనీ…శాంతిని కోరుకునే ఇమ్రాన్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. 
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

భారత వాయుసేన పైలట్ అభినందన్ కాసేపట్లో భారత్ భూభాగంలో అడుగుపెట్టనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు..వేలాది మంది భారతీయులు వాఘా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. మరోవైపు, శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న కృషిలో భాగంగా అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు నిన్న ఇమ్రాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే

ఈ క్రమంలో అభినందన్ భారత్ లో అడుగుపెడుతున్న తరుణంలో పాక్ సోషల్ మీడియాలో ఈ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. భారత్ తో యుద్ధాన్ని కోరుకోకుండా… శాంతికి ద్వారాలు తెరిచిన గొప్ప నేతగా ఇమ్రాన్ ను పాక్ నెటిజన్లు కీర్తిస్తున్నారు. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

Read Also : ఆధార్ అప్ డేట్ : ఇకపై ఆ మూడింటికీ తప్పనిసరి