Bangladesh: బంగ్లా జాతీయ ఎన్నికల ముందు భారీ నిరసన.. ప్రభుత్వం ముందు 10 డిమాండ్లు

వారం క్రితం ఇదే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, బీఎన్‭పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. అనంతరం బీఎన్‭పీ జనరల్ సెక్రెటరీ మిర్జా ఫఖ్రుల్ సహా 1,000 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడ్డారంటూ వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు

In Dhaka, Opposition's massive protest rally to present 10-point demand before national elections

Bangladesh: వచ్చే ఏడాది బంగ్లాదేశ్‭లో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. సమయం సమీపిస్తున్న తరుణంలో విపక్షాలు విజృంభిస్తున్నాయి. శనివారం రాజధాని ఢాకాలో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‭పీ) ఆధ్వర్యంలో విపక్షాలు భారీ ర్యాలీని చేపట్టాయి. 14 ఏళ్లుగా అధికారినికి దూరంగా ఉన్న బీఎన్‭పీ.. ఎలాగైనా సరే ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆతృతలో ఉంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలను, సానుభూతిపరులను కూడగొట్టి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది.

వారం క్రితం ఇదే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, బీఎన్‭పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. అనంతరం బీఎన్‭పీ జనరల్ సెక్రెటరీ మిర్జా ఫఖ్రుల్ సహా 1,000 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడ్డారంటూ వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. అనంతరం, డిసెంబర్ 10న నిరసనపై ఆంక్షలు విధించారు. అయినప్పటికీ తమ ర్యాలీ ఆగదని పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం మిర్జా ఫఖ్రూల్ పేర్కొన్నారు.

MCD: బీజేపీ నేతలపై ఆప్ హార్స్ ట్రేడింగ్.. సంచలన ఆరోపణలు చేసిన కమల పార్టీ

అన్నట్టుగానే శనివారం రాజధానిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని అదుపు చేయడానికి ప్రభుత్వం 30,000 మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్, 4,000 మంది పారామిలిటరీ ఫోర్స్‭ని దింపిందంటే ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ ర్యాలీకి ముందే మిగిలిన విపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వం ముందు డిమాండ్లను లేవనెత్తినట్లు బీఎన్‭పీ పేర్కొంది.

పది డిమాండ్లు:
1. తాత్కాలిక ప్రభుత్వ వ్యవస్థను రాజ్యాంగబద్ధం చేయడం
2. డిజిటల్ భద్రతా చట్టాన్ని వెనక్కి తీసుకోవడం
3. విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యవసర వస్తువుల ధరల తగ్గింపు
4. అవినీతిని నిరోధించడానికి కమిషన్ ఏర్పాటు
5. అదృశ్యాలు, హత్యలు, మతపరమైన నేరాల బాధితులపై విచారణ
6. న్యాయాన్ని నిర్ధారించడం, ప్రభుత్వ సంస్థలు, బలగాలు స్వతంత్రంగా పనిచేయడానికి అనుమతించడం
7. ‘వివాదాస్పద’ సవరణను రద్దు చేయడానికి రాజ్యాంగ సంస్కరణ కమిషన్
8. ప్రభుత్వ ఎన్నికల వ్యవస్థను పునరుద్ధరించడం, ఎన్నికల సంఘం నియామక చట్టాన్ని రద్దు చేయడం
9. ఆర్థిక సంస్కరణల కమిషన్‌ను ఏర్పాటు చేయడం
10. పరిపాలనా సంస్కరణల కమిషన్‌ను ఏర్పాటు చేయడం