Masood Azhar: ధురంధర్ మూవీలో చూపించినట్లే జరుగుతుంది కదా.. అనుమానాస్పద రీతిలో జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడు మృతి
Masood Azhar : జైష్-ఎ-మొహమ్మద్ అధ్యక్షుడు మసూద్ అజార్ మృతి చెందాడు.
- Dharani Pilli
- Published On : March 31, 2026 / 12:07 PM IST
In Pakistan Jaish chief Masood Azhar brother dies under mysterious circumstances
- జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడు మృతి
- అనుమానాస్పద రీతిలో మరణం
- ధృవీకరించిన భారత నిఘా వర్గాలు
Masood Azhar : ధురంధర్ సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాను చూశారు. ధురంధర్ రివేంజ్‌లో ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న వారు, ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి.. తప్పించుకుని పాకిస్తాన్ పారిపోయిన వారు.. ఒకానొక సమయంలో వరుసగా అనుమానాస్పద రీతిలో దారుణ హత్యకు గురవుతుంటారు. వీళ్లందరినీ ఎవరు చంపుతున్నారనేది అర్థం కాదు. సేమ్ ఇదే సీన్ రియల్‌గా వెలుగులోకి వచ్చింది. జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడు మృతి చెందాడు. అతడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దాయాది దేశం పాకిస్తాన్‌లో సంచలన వార్త ఒకటి ప్రచారమవుతోంది. జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడైన మొహమ్మద్ తాహిర్ అన్వర్ చనిపోయాడని ఆ వార్త సారాంశం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తాహిర్ అన్వర్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడని తెలుస్తోంది. భారత నిఘా సంస్థల వర్గాలు తాహిర్ అన్వర్ మృతిని ధృవీకరించాయి. అయితే మరణం వెనుక గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అతడి మరణాన్ని సంస్థ అధికారిక ఛానల్ ద్వారా ధృవీకరించగా, అతడి అంత్యక్రియలు బహవల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని హెవీ ఇండస్ట్రీస్ రోడ్‌లో ఉన్న జామియా ఉస్మాన్ వా అలీలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉంటే.. తాహిర్ అన్వర్.. జైష్-ఎ-మొహమ్మద్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. తాహిర్ అన్వర్ మరణించినట్లు.. పాకిస్తాన్ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. జైష్-ఎ-మొహమ్మద్ సాధారణ సంస్థ కాదు. ఇది గతంలో భారత్‌లో జరిగిన పలు ప్రధాన దాడులతో సంబంధం కలిగి ఉంది. వీటిల్లో ముఖ్యమైనవి 2001లో పార్లమెంటు మీద దాడి, 2016లో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్, 2016లో ఉరి దాడులు, 2019లో పుల్వామా దాడుల వెనుక ఈ సంస్థ హస్తం ఉంది.
అయితే కొన్నాళ్ల క్రితం భారత దళాలు పాకిస్తాన్‌లోని జైష్ లక్ష్యాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బహవల్పూర్‌లో జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఈ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో, ఈ నష్టాలను జైష్ మొదటిసారిగా పరోక్షంగా అంగీకరించింది.
సంస్థకు చెందిన ఒక సీనియర్ కమాండర్, ఆపరేషన్ సింధూర్ కింద భారత్ చేసిన బహవల్పూర్ దాడిలో అజార్ కుటుంబ సభ్యులు మరణించారని అంగీకరించారు. ఈ దాడి పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగింది. ఆ దాడిలో 26 మంది అమాయక పౌరుల ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు. ఇందుకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన సుమారు 10 మంది — అతని సోదరి, ఆమె భర్త, ఒక మేనల్లుడు, ఒక మేనకోడలు మరియు ఇతర కుటుంబ సభ్యులు — మరణించారు. అతని సహచరులు కూడా పలువురు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
