Bab el Mandab: మరో జలసంధికి పొంచి ఉన్న ముప్పు..! దాన్ని కూడా మూసేస్తాం..! అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12శాతం దీని గుండానే పయనిస్తోంది. లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ తయారీ వస్తువులు, ఆహార పదార్దాలు ఈ మార్గంలోనే రవాణ అవుతున్నాయి.
Bab el Mandab: దాడులు, ప్రతీకార దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్.. ఇజ్రాయెల్-అమెరికా దాడులకు నెల రోజులు అవుతోంది. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం పశ్చిమాసియాను అతలాకుతలం చేసింది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై అటాక్స్ చేశాయి. భారీ ఎయిర్ స్ట్రైక్స్ తో మొదటి 12 గంటల్లోనే 900 దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో పాటు ఇతర కీలక నేతలంతా మరణించారు.
ఇరాన్ మినాబ్ సమీపంలోని స్కూల్ పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి చేసింది. ఈ అటాక్ లో సుమారు 170 మంది చిన్నారులు మృతి చెందారు. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్స్ తో దాడులు చేసింది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ బేస్ లపైనా అటాక్స్ చేసింది. అంతేకాదు కీలకమైన హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇది ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంధన కొరతతో యావత్ ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ప్రపంచానికి మరిన్ని చమురు కష్టాలు?
హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ సాగిస్తున్న దిగ్బంధనంతో సముద్రంలో సరుకు రవాణకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభానికి ఇదే కారణమైంది. ఇప్పుడు మరో జలసంధికి ముప్పు ముంచుకొస్తోంది. ఇరాన్ లో కీలకమైన ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తే.. బాబ్ అల్ మాండెబ్ జలసంధిని కూడా దిగ్బంధిస్తామని అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఈ నౌకా మార్గం కూడా మూసుకుపోతే ప్రపంచానికి మరిన్ని చమురు కష్టాలు తప్పవు.
అరేబియా ద్వీపకల్పానికి పశ్చిమాన మరో జల మార్గమే ఈ బాబ్ అల్ మాండెబ్ జలసంధి. అరబిక్ భాషలో కన్నీటి ద్వారం లేదా విషాద ద్వారం అని అర్థం వస్తుంది. అక్కడ ప్రతికూల పరిస్థితుల కారణంగా అనేక నౌకలు ప్రమాదానికి గురయ్యాయి. అందువల్లే ఈ మార్గానికి ఆ పేరు వచ్చింది. 1869లో సూయజ్ కెనాల్ తెరిచాక ఈ జలసంధికి ప్రాముఖ్యత పెరిగింది. ఇది మధ్యధరా సముద్రం, హిందూ మహా సముద్రానికి మధ్య కీలక లింక్ గా మారింది. యెమన్, జిబౌటీ మధ్య ఎర్ర సముద్రాన్ని, అరేబియా సముద్రాన్ని అనుసంధానం చేస్తుంది.
సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలకమైన తీవ్ర ప్రాంత కారిడార్ గా మారింది. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య ఈ జలసంధి ఒక గేట్ వే లా పని చేస్తుంది. ఈ జలసంధి వెడల్పు 30 కిలోమీటర్లు మాత్రమే. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణ అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12శాతం దీని గుండానే పయనిస్తోంది. లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ తయారీ వస్తువులు, ఆహార పదార్దాలు ఈ మార్గంలోనే రవాణ అవుతున్నాయి.
ఏటా సుమారు 94 లక్షల కోట్ల రూపాయల విలువైన సరకులు ఈ జలసంధి నుంచే రవాణ అవుతున్నాయి. ఇక ఇరాన్ కు మద్దతిచ్చే హౌతీలు ఈ మార్గంలో మోహరించారు. యెమన్ లో ని ఈ ముఠా ఎర్ర సముద్రం తీరంలోని కొన్ని భాగాలను నియంత్రిస్తోంది. సముద్రంలోని లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం హౌతీలకు ఉంది. 2023 అక్టోబర్ 7న గాజా యుద్ధం చెలరేగాక పాలస్తీనా వాసులకు సంఘీభావంగా హౌతీలు వార్ లోకి దిగారు. ఇరాన్, చైనాలు అందించిన డ్రోన్లు, నౌక విధ్వంసక క్షిపణులు, వార్ బోట్లతో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
Also Read: ఫోన్ చేసి మరీ ఇజ్రాయెల్ ప్రధానిపై మండిపడ్డ జేడీ వాన్స్..! అసలేం ఏం జరిగిందంటే?
