Gold Rates: భారత్‌తో పోలిస్తే.. ఈ దేశాల్లో బంగారం ధరలు చాలా తక్కువ.. అవి ఏవి, కారణం ఏంటి అంటే..

మన దేశంలో బంగారం ధరలు భగ్గుమంటుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.

Gold Rates: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇండియాలో పసిడి పరుగులకు అడ్డు లేకుండాపోయింది. గోల్డ్ ధరలు పెరుగుతున్న తీరు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. భారత్ లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల మార్క్ ను తాకింది. దాంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. కనీసం రవ్వంత పసిడినైనా కొనగలమా అని బెంగపెట్టేసుకున్నారు.

మన దేశంలో బంగారం ధరలు చాలా కాస్ట్ లీగా ఉంటే.. కొన్ని దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడ పుత్తడి ధరలు చాలా చవక. ఇండియా కంటే చౌకగా గోల్డ్ లభించే దేశాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్
ఈ దేశంలో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర 70వేలు.

కారణం
ఇంగ్లండ్ లో గోల్డ్ మార్కెట్ అత్యంత పోటీతత్వం కలిగి ఉంది. భారత్‌లో విధించే 3% జీఎస్టీ, దిగుమతి సుంకాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ పన్నులు ఉన్నాయి.

కెనడా
కెనడాలో 24 క్యారెట్ 10 గ్రాముల పసడి ధర సుమారు రూ.72వేలు.

కారణం
తక్కువ పన్నులు, బంగారం ఉత్పత్తికి సమీపంలో ఉండటం కారణంగా ఇక్కడ ధరలు తక్కువ.

కంబోడియా
ఇక్కడ 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 72వేలు.

కారణం
కంబోడియా బంగారం మార్కెట్ తక్కువ పన్నులు, సుంకాల నుండి ప్రయోజనం పొందుతుంది. తక్కువ ధరలో ఉన్నతమైన బంగారాన్ని అందిస్తుంది.

Also Read: అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.79.. ఇప్పుడు రూ.లక్ష.. బంగారం ధరలు పెరిగిన తీరు ఇది..

దుబాయ్, యూఏఈ
ఇక్కడ 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర సుమారు రూ.78వేలు

కారణం
దుబాయ్ పన్ను రహిత బంగారం షాపింగ్‌కు ప్రసిద్ధి.
బంగారం కొనుగోళ్లపై వ్యాట్ లేదా దిగుమతి సుంకాలు ఉండవు.
భారతీయ ప్రయాణికులు పురుషులైతే 20 గ్రాములు, మహిళలైతే 40 గ్రాములు వరకు డ్యూటీ ఫ్రీగా తీసుకెళ్లవచ్చు.

హాంకాంగ్
ఈ దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర సుమారు రూ.79,400.

కారణం
హాంకాంగ్ తక్కువ పన్నులు, పోటీ బంగారం మార్కెట్ నుండి ప్రయోజనం పొందుతుంది.
బంగారం వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం, దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ భారతదేశం కంటే బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.

పన్ను మినహాయింపులు, పోటీ మార్కెట్లు, కరెన్సీ మారకం రేట్లు, తక్కువ దిగుమతి సుంకాలు కారణంగా ఈ దేశాలు ఇండియా కంటే తక్కువ ధరలో బంగారాన్ని అందిస్తున్నాయి.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here