United Kingdom : అక్కడ కోట్ల విలువైన ప్లాట్‌లు రూ.100 కే అమ్మేశారు..ఎక్కడంటే?

యూకేలో రూ.6.6 కోట్ల విలువైన ప్లాట్‌లు రూ.100 లకి విక్రయించబడ్డాయి. అధిక నిర్వహణ ఖర్చులు నివారించడానికి కార్న్ వాల్ కౌన్సిల్.. లూయీలోని 11 ప్లాట్‌లను కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కి ఒక్క రూపాయికి అమ్మేసింది.

United Kingdom

United Kingdom : చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా చాలా డబ్బులు అవసరం అవుతాయి. డబ్బులుండి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నా వాటి నిర్వహణ ఖర్చులు విపరీతంగానే ఉంటాయి. యునైటెడ్ కింగ్ డమ్‌లో నిర్వహణ ఖర్చులు భరించలేక కోట్లాది రూపాయల విలువైన ప్లాట్లను కేవలం 1 పౌండ్‌కి (సుమారు రూ.100) విక్రయించారట. ఎవరు? ఎవరికి?

Naatu Naatu : లండన్‌ వీధుల్లో 700 మంది ‘నాటు నాటు’ స్టెప్పు.. వీడియో చూశారా..?
UKలో గృహ సంక్షోభం ఒక పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా లండన్, సౌత్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల కొరత మరింత తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఆస్తి ధరలు, అద్దె ఖర్చులు రెండు పెరిగాయి. ఇల్లు కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా సవాల్‌గా మారింది. పెరుగుతున్న జనాభా కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యూకేలో రూ.6.6 కోట్ల విలువైన ప్లాట్ లు రూ.100 లకి విక్రయించబడ్డాయి. అధిక నిర్వహణ ఖర్చులు నివారించడానికి కార్న్ వాల్ కౌన్సిల్ లూయీలోని 11 ప్లాట్‌లను కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కి విక్రయించడానికి అంగీకరించింది. అదీ మన ఇండియన్ కరెన్సీలో వంద రూపాయలకే.

UK Killer Nurse : ఏడుగురు శిశువులను హత్య చేసిన యూకే నర్సుకు జీవిత ఖైదు

యునైటెడ్ కింగ్ డమ్‌లోని కార్న్ వాల్ కౌన్సిల్ 64,000 పౌండ్ల (రూ. 6,61,64745) విలువైన గ్రేడ్ II లిస్టెడ్ ఫ్లాట్‌లను నామ మాత్రంగా 1 పౌండ్ (సుమారు రూ.100) కి విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. కార్నిష్ పట్టణం మధ్యలో తక్కువ ధరలో ఇళ్లు దొరికే అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 13 న, కౌన్సిల్ క్యాబినెట్ లూయీలోని 11 కోస్ట్ గార్డ్ ప్లాట్ల యాజమాన్యాన్ని నామ మాత్రపు రుసుముతో కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కు బదిలీ చేయాలనే సిఫార్సుకి ఆమోదం తెలిపింది. కమ్యూనిటీ నేతృత్వంలోని ఈ ప్లాట్లను పునరుద్ధరించడం ద్వారా ఇంటి కొరతతో ఇబ్బంది పడుతున్న కొందరి సమస్య అయినా తీరే అవకాశం ఉంది.