Earth Rotation : పెరుగుతున్న భూ భ్రమణ వేగం..నిర్ణీత 24 గంటలకు ముందే పూర్తి

భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిర్ణీత 24 గంటలకు ముందే భూ భ్రమణం పూర్తి చేసుకొని...మరోసారి రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. గత నెల 29న 1.59 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూ భ్రమణం పూర్తయినట్టు గుర్తించారు. దీంతో చాలా చిన్న రోజుగా రికార్డుకెక్కింది. 1960 తర్వాత 2020లో ఇలా జరిగింది. 2020 జూలై 19న 24 గంటల కంటే 1.47 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూమి తన చూట్టూ తాను తిరిగింది. 2021లో కూడా భూ భ్రమణ వేగం పెరిగింది.

Earth rotation : భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిర్ణీత 24 గంటలకు ముందే భూ భ్రమణం పూర్తి చేసుకొని…మరోసారి రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. గత నెల 29న 1.59 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూ భ్రమణం పూర్తయినట్టు గుర్తించారు. దీంతో చాలా చిన్న రోజుగా రికార్డుకెక్కింది. 1960 తర్వాత 2020లో ఇలా జరిగింది. 2020 జూలై 19న 24 గంటల కంటే 1.47 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూమి తన చూట్టూ తాను తిరిగింది. 2021లో కూడా భూ భ్రమణ వేగం పెరిగింది. తాజాగా గత నెల మరోసారి స్పీడ్ పెరిగింది.

మరోవైపు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగడానికి సరైన కారణాలు ఇప్పటికీ తెలియడం లేదని శాస్త్రవేత్తలు అన్నారు. అయితే భూమి లోపలి లేదా బయటి పొరల్లో మార్పు, మహాసముద్రాలల్లో ఆటుపోట్లు, వాతావరణంలో మార్పులు కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే భౌగోళిక ధ్రువాల కదలికల వల్ల భూ భ్రమణ వేగం పెరగుతుందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. దీనిని చాండ్లర్ వొబుల్ అని వ్యవహరిస్తున్నారు.

Earth Rotation: భూమి ఒక రోజు ముందుగానే తిరిగేసింది..

భూ భ్రమణ వేగం పెరుగడంతో నెగిటివ్‌ లీప్‌ సెకండ్లకు దారి తీస్తుందని పరిశోధనకులు పేర్కొన్నారు. ఇది గ్లోబల్‌ సమయంపై ప్రభావం చూపడంతోపాటు కంప్యూటర్‌ ప్రొగ్రామ్‌లను క్రాష్‌ చేసి డేటా స్టోరేజ్‌ను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు